Share News

Shimla : ఆ 45 మంది ఏమయ్యారు?

ABN , Publish Date - Aug 03 , 2024 | 05:02 AM

కుంభవృష్టి కారణంగా సంభవించిన మెరుపు వరదల్లో గల్లంతైన హిమాచల్‌ ప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు చెందిన 45 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు.

Shimla : ఆ 45 మంది ఏమయ్యారు?

  • హిమాచల్‌ మెరుపు వరదల్లో గల్లంతైనవారి ఆచూకీ కరువు..!

రుద్రప్రయాగ్‌, శిమ్లా, ఆగస్టు 2: కుంభవృష్టి కారణంగా సంభవించిన మెరుపు వరదల్లో గల్లంతైన హిమాచల్‌ ప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు చెందిన 45 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. శ్రీఖండ్‌ మహదేవ్‌ మార్గంలో మేఘ విస్పోటనంతో సర్పరా, గాన్వి, కుర్బన్‌ ప్రాంతాలోనే 30 మంది నీటిలో కొట్టుకుపోయారు. వీరికోసం తీవ్ర స్థాయిలో గాలింపు కొనసాగుతోంది.

శుక్రవారం మరో మూడు మృతదేహాలు లభ్యం కావడంతో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 8కి చేరింది. కులులోని నిర్మండ్‌, సాయింజ్‌, మలానా, మండిలోని పధార్‌, శిమ్లాలోని రాంపూర్‌ బుధవారం అర్థరాత్రి ఆకస్మిక వర్షాలతో ప్రభావితమయ్యాయి. తొలుత ఐదుగురు చనిపోగా, ఇద్దరు పిల్లలు సహా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైనవారిలో 17 నుంచి 18 మంది మహిళలు, 8 నుంచి 9 మంది పిల్లలు ఉన్నట్లు హిమాచల్‌ సీఎం సుఖు తెలిపారు.

Updated Date - Aug 03 , 2024 | 05:02 AM