Shivraj Singh: ఎమ్మెల్యే పదవికి శివరాజ్ సింగ్ రాజీనామా
ABN , Publish Date - Jun 18 , 2024 | 09:23 PM
కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని బుధని నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విదిషా నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు.
భోపాల్: కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivaraj Singh Chouhan) మధ్యప్రదేశ్‌లోని బుధని (Budhni) నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విదిషా (Vidisha) నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. దీంతో మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బుధని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేటప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యానని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ తెలిపారు. బుధని నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకంగా సేవలందించానని, ప్రజల అభిమానం చూరగొనేందుకే తన యావజ్జీవితం అంకితం చేశానని చెప్పారు. మునుముందు కూడా తన శక్తి మేరకు ప్రజా సేవకు పునరంకితమవుతానని చెప్పారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు శివరాజ్ సింగ్ సేవలందించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో విదిషా నుంచి 8.21 లక్షలకు పైగా ఓట్ల మార్జిన్‌తో ఆయన గెలిచారు.
Read Latest National News and Telugu News