Bangladesh: రెచ్చిపోతున్న తీవ్రవాద శక్తులతో అరాచకం దిశగా బంగ్లాదేశ్
ABN , Publish Date - Nov 27 , 2024 | 08:55 PM
షేక్ హసీనాను గద్దెదింపిన తర్వాత బంగ్లాదేశ్ జమాతే ఇస్లామి సహా తీవ్రవాద సంస్థలు మళ్లీ చురుకుగా పనిచేస్తున్నాయని, హిందూ ఆలయాలు, ఆరాధనా స్థలాలపై దాడులు చేయడం నిత్యకృత్యంగా మారుతున్నాయని బంగ్లాదేశ్ మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్ చెప్పారు.
న్యూఢిల్లీ: భారత వ్యతిరేక వాదనను పెంచడం, తీవ్రవాద శక్తులను ప్రోత్సహిస్తుండటం వంటివి బంగ్లాదేశ్ (Bangladesh)ను పూర్తి అరాచకంగా మారుస్తు్న్నాయని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్ (Hasan Mahmud) అన్నారు. మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చర్యలతో ప్రజాస్వామ్యం అరాచకవాదుల పాలనగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. హసీనా కేబినెట్‌లో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఆయన పీటీఐ వార్తా సంస్థకు టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్టు, అనంతరం చోటుచేసుకున్న ఆందోళనకర పరిణామాలపై ఆయన మాట్లాడారు.
Jharkhand: హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం ఫిక్స్
షేక్ హసీనాను గద్దెదింపిన తర్వాత బంగ్లాదేశ్ జమాతే ఇస్లామి సహా తీవ్రవాద సంస్థలు మళ్లీ చురుకుగా పనిచేస్తున్నాయని, హిందూ ఆలయాలు, ఆరాధనా స్థలాలపై దాడులు చేయడం నిత్యకృత్యంగా మారుతున్నాయని మహమూద్ చెప్పారు. ఈ దాడులతో మైనారిటీ వ్యతిరేక భావజాలం చాలా స్పష్టంగా కనిపిస్తోందని తప్పుపట్టారు. బంగ్లాదేశ్‌లో తీవ్రవాద సంస్థలు రెచ్చిపోవడం వెనుక విదేశీ శక్తుల జోక్యం కనిప్తోందన్నారు. ఢాకాలోని పాక్ రాయబార కార్యాలయం ముందు చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే తీవ్రవాద సంస్థలతో పాక్ సన్నిహితంగా మెలుగుతోందని అనిపిస్తోందన్నారు. అమెరికాలో కొత్తగా అధికార పగ్గాలు చేపడుతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగేందుకు సాధ్యమైనంత త్వరగా చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌తోనే శాంతి, భద్రత సాధ్యమని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Google Maps: ఉత్తరప్రదేశ్‌లో కారు ప్రమాదం... స్పందించిన గూగుల్
Nagendra: మళ్లీ కేబినెట్‌లోకి నాగేంద్ర..
Sanatan Board: 'సనాతన్ ధర్మ రక్షా బోర్డు' ఏర్పాటు పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
Read More National News and Latest Telugu News