Train Accident: మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన రైలు..
ABN , Publish Date - Sep 07 , 2024 | 09:13 AM
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో(Jabalpur) శనివారం తెల్లవారుజామున సోమనాథ్ ఎక్స్‌ప్రెస్ రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం(Train Accident) స్టేషన్‌కు 150 మీటర్ల దూరంలో ఉదయం 5.50 గంటలకు జరిగింది.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో(Jabalpur) శనివారం తెల్లవారుజామున సోమనాథ్ ఎక్స్‌ప్రెస్ రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం(Train Accident) స్టేషన్‌కు 150 మీటర్ల దూరంలో ఉదయం 5.50 గంటలకు జరిగింది.
ఇండోర్-జబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (22191) "డెడ్ స్టాప్ స్పీడ్" వద్ద పట్టాలు తప్పింది. పశ్చిమ మధ్య రైల్వే, CPRO, హర్షిత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. "రైలు ఇండోర్ నుంmr వస్తోంది. జబల్‌పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 6 వద్దకు చేరుకోగానే, ముందు ఉన్న రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన జబల్‌పూర్ స్టేషన్ నుంచి 100-150 మీటర్ల దూరంలో ఉదయం 5.50కి జరిగింది" అని పేర్కొన్నారు.
తరచూ ప్రమాదాలు..
ఉత్తరప్రదేశ్‌లోని సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన నెల రోజుల్లోనే జబల్‌పూర్ రైలు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో అహ్మదాబాద్-వారణాసి సబర్మతి ఎక్స్‌ప్రెస్ 20 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ట్రాక్‌పై బండరాయిని ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
జులై 30న జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ సమీపంలో హౌరా-ముంబై CSMT మెయిల్‌కు చెందిన 18 పట్టాలు పక్కకు జరిగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా తరచూ రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
For Latest News click here