Share News

Sonam Wangchuk: కేంద్రం హామీతో దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్

ABN , Publish Date - Oct 21 , 2024 | 09:13 PM

లఢక్‌కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్‌పై వాంగ్‌చుక్ తదితరులు అక్టోబర్ 6వ తేదీ నుంచి ఢిల్లీలోని లఢక్ భవన్‌లో నిరాహార దీక్ష సాగిస్తున్నారు.

Sonam Wangchuk: కేంద్రం హామీతో దీక్ష విరమించిన  సోనమ్ వాంగ్‌చుక్

న్యూఢిల్లీ: లఢక్‌ డిమాండ్లపై నిలిచిపోయిన చర్చలను డిసెంబర్‌లో కొనసాగిస్తామని కేంద్ర హామీ ఇవ్వడంతో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk), ఆయన అనుచరులు సోమవారం సాయంత్రం నిరాహారదీక్షను విరమించారు. లఢక్‌కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్‌పై వాంగ్‌చుక్ తదితరులు అక్టోబర్ 6వ తేదీ నుంచి ఢిల్లీలోని లఢక్ భవన్‌లో నిరాహార దీక్ష సాగిస్తున్నారు. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వ అగ్రనాయకత్వంతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సానుకూల సంకేతాలు పంపింది.

Amit Shah: అమిత్‌షా కోల్‌కతా పర్యటన వాయిదా.. ఎందుకంటే


వాంగ్‌చుక్‌ను కలిసి ఎంహెచ్ఏ అధికారులు

జమ్మూ అండ్ కశ్మీర్ అండ్ లఢక్ జాయింట్ సెక్రటరీ ప్రసాద్ లోఖాండే నేరుగా వాంగ్‌చుక్‌ను కలిసి హోం మంత్రిత్వ శాఖ లేఖను అందజేశారు. నిమ్మరసం అందజేసి దీక్షను విరమింప చేశారు. లఢక్ ప్రతినిధులతో మంత్రిత్వ శాఖ హైపవర్డ్ కమిటీ డిసెంబర్ 3న చర్చలు జరుపుతుందని ఆ లేఖలో హోం శాఖ తెలియజేసింది.


దీక్ష విరమణ అనంతరం వాంగ్‌చుక్ మాట్లాడుతూ, కేంద్ర హోం శాఖ అధికారులు, లఢక్ జాయింట్ సెక్రటరీ తమను కలిసి డిసెంబర్ 3న చర్చలకు సంబంధించి లేఖను అందించినట్టు చెప్పారు. తమ ప్రధాన డిమాండ్ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో నిలిచిపోయిన చర్చలు డిసెంబర్ 3న కొనసాగుతాయని, ఇరువర్గాల మధ్య చర్చలు నిజాయితీగా, సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

CJI: అయోధ్య వివాద పరిష్కారం కోసం దేవుడ్ని ప్రార్థించా.. జస్టిస్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Oct 21 , 2024 | 09:13 PM