UPA: యూపీఏ హయాంలో ఆమె సూపర్ ప్రైమ్ మినిస్టర్‌గా వ్యవహరించారు.. నిర్మలా ఎద్దేవా
ABN , Publish Date - Feb 10 , 2024 | 01:22 PM
యూపీఏ హయాంలో జవాబుదారీతనం లేదని, ప్రజల సమస్యలు పట్టించుకున్న నేతా ఉండేవారు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఆక్షేపించారు. లోక్‌సభలో ఆమె కాంగ్రెస్(Congress) పార్టీపై విరుచుకుపడ్డారు.
ఢిల్లీ: యూపీఏ హయాంలో జవాబుదారీతనం లేదని, ప్రజల సమస్యలు పట్టించుకున్న నేతా ఉండేవారు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఆక్షేపించారు. లోక్‌సభలో ఆమె కాంగ్రెస్(Congress) పార్టీపై విరుచుకుపడ్డారు. యూపీఏ హయాంతో ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిని పోల్చుతూ విడుదల చేసిన శ్వేతపత్రంపై ఆమె మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలో ప్రధానిగా ఎవరున్నా.. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) వెనక ఉండి చక్రం తిప్పేవారని నిర్మలా ఎద్దేవా చేశారు. సోనియా అనాలోచిత నిర్ణయాలతోనే ఆర్థిక వ్యవస్థ దివాళా తీసే స్థాయికి వెళ్లిందని విమర్శించారు.
ప్రభుత్వానికి సంబంధించిన ఫైళ్లను అడ్డదారిలో రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు అప్పగించారని ఆరోపించారు. శ్వేతపత్రంలో ఉన్న ప్రతి అంశం నిజమైనదేనని, సాక్ష్యాధారాలతో సహా వాటిని నిరూపిస్తామని తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ ఆర్డినెన్స్‌ని చించేశారని.. అది ప్రధానిని అవమానించడం కాదా? అని నిర్మలా ప్రశ్నించారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేనాటికీ దేశ సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా లేవన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక దేశ రక్షణకు బడ్జెట్‌లో నిధులను గణనీయంగా పెంచామని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి