Share News

Watch Video: సోనియాగాంధీ, జయాబచ్చన్ కలుసుకున్న వేళ...

ABN , Publish Date - Jul 24 , 2024 | 05:45 PM

గాంధీ, బచ్చన్ కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఒకరికొరు తారస పడితే అక్కడ సహజంగానే ఒకింత ఆసక్తికర వాతవారణం నెలకొంటుంది. అలాంటి అరుదైన ఘటనే బుధవారంనాడు పార్లమెంటు ఆవరణలో చేటుచేసుకుంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఒకరికొకరు ఎదురుపడి ఆప్యాయంగా పలకరించుకున్నారు.

Watch Video: సోనియాగాంధీ, జయాబచ్చన్ కలుసుకున్న వేళ...

న్యూఢిల్లీ: పార్టీలు వేరైనా గాంధీ ప్యామిలీ, బచ్చన్ ఫ్యామిలీకి మధ్య ఒకప్పుడు మంచి అనుబంధమే ఉండేది. ఈ రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఒకరికొరు తారస పడితే అక్కడ సహజంగానే ఒకింత ఆసక్తికర వాతవారణం నెలకొంటుంది. అలాంటి అరుదైన ఘటనే బుధవారంనాడు పార్లమెంటు ఆవరణలో చేటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ (Sonia Gandhi) , సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ (Jayabachchan) ఒకరికొకరు ఎదురుపడి ఆప్యాయంగా పలకరించుకున్నారు.


పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు సోనియాగాంధీ కారులో చేరుకోగానే ఆమెకు కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఒబ్రెయిన్ అభివాదం చేశారు. సోనియాగాంధీ ప్రతి నమస్కారం చేస్తూ ముందుకు వెళ్తుండగా జయాబచన్ ఎదురయ్యారు. దీంతో ఇద్దరూ కొద్దిసేపు నవ్వుతూ ముచ్చటించుకున్నారు.

Rahul Gandhi: రైతు ప్రతినిధులతో రాహుల్ .. ఎంఎస్‌పీకి చట్టబద్ధతపై ప్రైవేటు బిల్లు తెచ్చే యోచన


కేంద్ర బడ్జెట్ 2024లో వివక్షపై 'ఇండియా' కూటమి నేతలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేసి పార్లమెంటు వెలుపల నిరసనకు దిగిన సమయంలో సోనియాగాంధీ అక్కడకు చేరుకోవడంతో నేతలు సందడిగా కనిపించారు. సోనియాగాంధీ, జయాబచన్ ఆప్యాయంగా పలుకరించుకోవడంతో అక్కడి వాతావరణం అహ్లాదంగా మారింది.


గాంధీ, బచ్చన్ కుటుంబాల మధ్య...

ఒకానొక సమయంలో గాంధీ కుటుంబ సభ్యులు, జయాబచ్చన్ కుటుంబం మధ్య సత్సంబంధాలు ఉండేవి. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు కుటంబాల మధ్య సంబంధాలు కూడా తగ్గాయి. ఒకప్పుడు మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చాలా సన్నిహితంగా ఉండేవారు. అమితాబ్ ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు, న్యూఢిల్లీలో నివాసం ఉన్న సమయంలో రాజీవ్, సంజయ్ గాంధీ, అమితాబ్ కలుసుకునేవారని చెబుతుంటారు. రాజీవ్ గాంధీ కోరడంతో అమితాబ్ బచ్చన్ 1984లో అలహాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. అయితే బోఫోర్స్ కుంభకోణంలో అమితాబ్ పేరు తెరపైకి రావడంతో ఆయన లోక్‌సభకు రాజీనామా చేశారు. ఈ పరిణామంతో రాజీవ్‌గాంధీ ఆయనతో మాట్లాడటం మానేశారని, అప్పట్నించి ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు క్షీణించాయని చెబుతారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jul 24 , 2024 | 05:45 PM