Share News

Suburban train: సబర్బన్‌ రైలు నుంచి పొగలు.. ప్రయాణికుల్లో ఆందోళన

ABN , Publish Date - Feb 14 , 2024 | 12:05 PM

తిరువళ్లూర్‌ సమీపంలో సబర్బన్‌ రైలులో హఠాత్తుగా పొగలు రేగడంతో ప్రయాణికులు బోగీల నుంచి కిందకు దూకి పరుగులు తీశారు.

Suburban train: సబర్బన్‌ రైలు నుంచి పొగలు.. ప్రయాణికుల్లో ఆందోళన

చెన్నై: తిరువళ్లూర్‌ సమీపంలో సబర్బన్‌ రైలులో హఠాత్తుగా పొగలు రేగడంతో ప్రయాణికులు బోగీల నుంచి కిందకు దూకి పరుగులు తీశారు. వేలూరు కంటోన్మెంట్‌ నుంచి చెన్నై బీచ్‌కు మంగళవారం ఉదయం సబర్బన్‌ రైలు బయల్దేరింది. అరక్కోణం మార్గంగా తిరువళ్లూర్‌ వైపుకు సెంజిమనపాక్కం - కడంబత్తూర్‌ రైల్వేస్టేషన్‌ మధ్యలో బ్రేక్‌ సిస్టమ్‌ ఒత్తిడి కారణంగా బ్యాటరీ నుంచి పొగలు వెలువడ్డాయి. దీంతో డ్రైవర్‌ రైలును నిలిపివేశాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపుచేశారు. 30 నిముషాల తర్వాత రైలును కడంబత్తూర్‌ రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చిన అధికారులు, రైలు నడిపేందుకు అవకాశముందా అని డ్రైవర్‌ను అడిగి తెలుసుకున్నారు. 20 నిమిషాల అనంతరం రైలును తిరువళ్లూర్‌ స్టేషన్‌కు చేరుకుంది. ఈ కారణంగా పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది సకాలంలో వెళ్లలేకపోయారు.

nani5.jpg

Updated Date - Feb 14 , 2024 | 12:05 PM