Share News

Sukhbir Singh Badal: బూట్లు, పాత్రలు శుభ్రం చేయాలని బాదల్‌కు అకాల్ తఖ్త్ శిక్ష

ABN , Publish Date - Dec 02 , 2024 | 08:56 PM

స్వర్ణ దేవాలయంతో సహా రాష్ట్రంలో పలు గురుద్వారాల వద్ద సేవాదార్ దుస్తులు ధరించి పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ను అకాల్ తఖ్త్ ఆదేశించింది.

Sukhbir Singh Badal: బూట్లు, పాత్రలు శుభ్రం చేయాలని బాదల్‌కు అకాల్ తఖ్త్ శిక్ష

అమృత్‌సర్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ (Sukhbir Singh Badal)కు సిక్కుల ఆధ్యాత్మిక విభాగం అకాల్ తఖ్త్ (Akal Takht) శిక్షను నిర్ధారించింది. స్వర్ణ దేవాలయంతో సహా రాష్ట్రంలో పలు గురుద్వారాల వద్ద సేవాదార్ దుస్తులు ధరించి పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని ఆదేశించింది. అకాలీ దళ్ చీఫ్ పదవికి ఆయన చేసిన రాజీనామాను ఆమోదించింది. కొత్త కార్యవర్గాన్ని ఆరు నెలల్లో ఎన్నుకోవాలని కూడా అకాల్ తఖ్త్ సూచించింది. బాదల్ తండ్రి, మాజీ సీఎం ప్రకాష్ సింగ్ సింగ్ బాదల్‌కు గతంలో ఇచ్చిన Fakhar-e-Kaum బిరుదును కూడా ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది.

Ajit Pawar: పది రోజులుగా ఉత్కంఠ.. ఢిల్లీకి అజిత్ పవార్


''గురుద్వారాల వద్ద ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకూ కూర్చోవాలి. గంటపాటు సేవాదార్‌గా సేవలు చేసిన తర్వాత లంగర్ హాల్‌లో గంట పాటు పాత్రలు శుభ్రం చేయాలి'' అని బాదల్‌ను అకాల్ తఖ్త్ ఆదేశించింది. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న 2007-17 మధ్య కాలంలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. పార్టీతో పాటు ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టు అకాల్ తఖ్త్ నిర్దారించి ఆయనను దోషిగా తేల్చింది. దీంతో బాదల్ బేషరతుగా క్షమాపణలు చెప్పి, సాధ్యమైనంత త్వరగా తనకు శిక్ష వేయాలని అకాల్ తఖ్త్‌ను కోరారు.


కాగా, బాదల్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు బిబీ జాగీర్ కౌర్, ప్రేమ్ సింగ్ చందుమజ్ర, సూర్జిత్ సింగ్, బిక్రమ్‌జీత్ సింగ్ మజితియ, బీజేపీ నేత సోహన్ సింగ్ థాండల్, మహేష్ ఇందిర్ సింగ్, ఆదేష్ ప్రతాప్ సింగ్ కయిరోన్ సహా పలువురుని దోషులుగా గుర్తించి వారిని కూడా స్వర్ణాలయం క్లాంప్లెక్స్‌లో మంగళవారంనాడు పాత్రలు శుభ్రం చేయాల్సిందిగా అకాల్ తఖ్త్ ఆదేశించింది.


ఇది కూడా చదవండి

Sabarmati Report: పార్లమెంటులో 'సబర్మతి రిపోర్ట్'ను వీక్షించనున్న మోదీ

Farmers Protest Impact: రైతుల నిరసన ఎఫెక్ట్.. ఎక్స్‌ప్రెస్‌వేపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

Cyclone Fengal Impact: ఫెంగల్ తుపాను కారణంగా 19 మంది మృతి.. ఎక్కడెక్కడంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 02 , 2024 | 08:56 PM