Supreme Court : ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్
ABN , Publish Date - Oct 19 , 2024 | 02:54 AM
నగదు అక్రమ చలామణి కేసులో ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్‌కు శుక్రవారం రౌజ్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 18: నగదు అక్రమ చలామణి కేసులో ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్‌కు శుక్రవారం రౌజ్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణ ఇంకా ప్రారంభం కాకపోవడం, సుదీర్ఘ కాలం పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండడంతో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్నే తెలిపారు. ఆదాయానికి మించి రూ.1.47 కోట్ల మేర ఆస్తులు కలిగి ఉన్నారంటూ సీబీఐ 2017లో కేసు నమోదు చేసింది. నాలుగు డొల్ల కంపెనీల పేరుతో మనీలాండరింగ్ పాల్పడ్డారంటూ అనంతరం ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఆ కంపెనీలకు చెందిన రూ.4.81 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. 2022 మే 30న అరెస్టు చేసింది. మధ్యలో అనారోగ్య కారణాల దృష్ట్యా మెడికల్ బెయిల్‌పై విడుదలయ్యారు. మొత్తంగా 18 నెలల పాటు జైలులో గడపడంతో ప్రస్తుతం పలు షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.