Supreme Court: దివ్యాంగులకు సౌలభ్యంగా నిర్మాణాలు ఉండాలి
ABN , Publish Date - Nov 09 , 2024 | 06:12 AM
దివ్యాంగులకు అనుకూలంగా నిర్మాణాలు ఉండేలా ప్రామాణిక నిబంధనలు రూపొందించాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
న్యూఢిల్లీ, నవంబరు 8: దివ్యాంగులకు అనుకూలంగా నిర్మాణాలు ఉండేలా ప్రామాణిక నిబంధనలు రూపొందించాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నిబంధనలు కేవలం మార్గదర్శకాలుగా మిగిలిపోకుండా చట్టం ప్రకారం అమలు చేయాల్సి ఉందని తెలిపింది. వీటి రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న సెంటర్ ఫర్ డిజేబిలిటీ స్టడీ్‌సకు సూచించింది.