Share News

Supreme Court: రాజ్యాంగ పీఠిక అంశంపై సుప్రీం కీలక తీర్పు

ABN , Publish Date - Nov 25 , 2024 | 03:41 PM

ఇండియన్ కాంటెక్స్ట్‌లో సోషలిజం, సెక్యులరిజం అనేవి రాజ్యాంగంలో అంతర్భాగమని, పాశ్చాత్య దక్పథం చూడదరాదని ధర్మాసనం పేర్కొంది. ఈ పదాలకు వివిధ వివరణలు ఉన్నాయని, వేర్వేరుగా అన్వయించుకుంటున్నారని గత విచారణలోనూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Supreme Court: రాజ్యాంగ పీఠిక అంశంపై సుప్రీం కీలక తీర్పు

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ పీఠిక (Preamble of the Indian Constitution)లోని సామ్యవాదం (Socialism), లౌకికవాదం (Secularism) అనే పదాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు తోసిపుచ్చింది. రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్, బలరాం సింగ్ ఈ పిటిషన్లు వేశారు. భారత ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు 1976లో 42వ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక పదాలను పీఠికలో చేర్చారు. దీనిపై సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Maharashtra: సీఎం పోస్టుపై ఫార్ములా.. అజిత్ పవార్ ఏమన్నారంటే


ఎమర్జెన్సీ సమయంలో ఈ సవరణలు చేశారని, పార్లమెంటులో చర్చ జరగలేదని పిటిషనర్లు వాదించారు. సవరణల చట్టబద్ధతను ప్రశ్నించారు. దీనిపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసి సోమవారంనాడు ఆ పిటిషన్లను కొట్టివేసింది. పీఠికతో సహా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పునరుద్ఘాటించింది.


ఇండియన్ కాంటెక్స్ట్‌లో సోషలిజం, సెక్యులరిజం అనేవి రాజ్యాంగంలో అంతర్భాగమని, పాశ్చాత్య దక్పథం చూడదరాదని ధర్మాసనం పేర్కొంది. ఈ పదాలకు వివిధ వివరణలు ఉన్నాయని, వేర్వేరుగా అన్వయించుకుంటున్నారని గత విచారణలోనూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందరికీ సమానావశాలుగా సోషలిజంను చూడాలని, సెక్యూలర్ పదం కూడా అంతేనని తెలిపింది. 1976లో రాజ్యాంగ పీఠికలోని 'సావరిన్, డెమోక్రటిక్ రిపబ్లికన్' అనే పదాలను సవరణ ద్వారా 'సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్'గా మార్చారు. అయితే, పీఠికను మార్చడం కానీ, చేర్చడం కానీ, రద్దు చేయడం కానీ చేయరాదని సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్‌లో వాదించారు.


Sambhal Violence: మసీదు సర్వే నేపథ్యంలో ఘర్షణ.. 20 మంది అరెస్ట్, స్కూల్స్, ఇంటర్నెట్ బంద్

Rahul: యూపీలోని సంభాల్ కాల్పుల ఘటనపై రాహుల్ ఏమన్నారంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 25 , 2024 | 04:39 PM