Teachers' Recruitment Case: దీదీకి జస్ట్ రిలీఫ్
ABN , Publish Date - Apr 29 , 2024 | 05:37 PM
పశ్చిమ బెంగాల్‌లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కుంభకోణంపై కోల్‌కత్తా హైకోర్టు ఇటీవల సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే కోల్‌కత్తా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించినట్లు అయింది. దాదాపు 24 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది నియామకం కోసం.. 2016లో వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: పశ్చిమ బెంగాల్‌లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కుంభకోణంపై కోల్‌కత్తా హైకోర్టు ఇటీవల సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే కోల్‌కత్తా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించినట్లు అయింది. దాదాపు 24 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది నియామకం కోసం.. 2016లో వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించింది.
LokSabha Elections: దేశంలో ఎయిర్ పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు
ఈ పరీక్షలకు దాదాపు 23 లక్షల మంది హాజరయ్యారు. అయితే ఈ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ.. పలువురు నిరుద్యోగులు కోల్‌కత్తా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై హైకోర్టు విచారణ జరిపి.. ఈ మొత్తం నియామకాలను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరపాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. అలాగే మూడు నెలల్లో నివేదిక అందజేయాలని సీబీఐకి ఈ సందర్బంగా హైకోర్టు సూచించింది.
AP Elections: ఎన్నికల ముందు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్!
అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన పక్షం రోజుల్లో వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామాకాలు చేపట్టేందుకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని హైకోర్టు సూచించింది. దీంతో హైకోర్టు ఆదేశాలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని ఆమె స్పష్టం చేసింది. ఆ క్రమంలో హైకోర్టు తీర్పు వెలువడిన 72 గంటలకే ఈ అంశంపై మమత ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. దీంతో ఈ అంశంపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతో సీఎం మమతబెనర్జీకి కాస్తా ఉపశమనం లభించినట్లు అయింది.
TS SSC Results Updates : రేపే 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
Read National News And Telugu News