Patna: క్యాన్సర్ బారిన పడిన మాజీ ఉపముఖ్యమంత్రి.. ఆందోళనలో అభిమానులు
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:35 PM
బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ(Sushil Kumar Modi) క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. బుధవారం ఆయన ఎక్స్‌లోని ఓ పోస్ట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.
పట్నా: బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ(Sushil Kumar Modi) క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. బుధవారం ఆయన ఎక్స్‌లోని ఓ పోస్ట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఆరు నెలలుగా నేను క్యాన్సర్‌తో పోరాడుతున్నాను. అనారోగ్యం కారణంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతున్నా. లోక్ సభ ఎన్నికల్లో ఏమీ చేయలేను. ప్రధాని మోదీకి నా సమస్యను వివరించాను. ఈ దేశానికి, బిహార్ ప్రజలకు, బీజేపీకి (BJP) ఎప్పటికీ రుణపడి ఉంటా. క్యాన్సర్ వచ్చిన విషయాన్ని చెప్పడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. నా జీవితం ప్రజా సేవకు అంకితం. దేశ సేవలో ఎప్పుడూ ముందుంటా" అని రాసుకొచ్చారు. 72 ఏళ్ల సుశీల్ కుమార్ బిహార్ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్నారు. 2005 - 2020 మధ్య కాలంలో సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంలో రెండు సార్లు ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.
PM Modi: 9న చెన్నైలో ప్రధాని మోదీ రోడ్‌షో
2020లో ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాసవాన్ మరణంతో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నికల్లో ఆ సీటుకు సుశీల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఆయన పదవీకాలం ముగిసింది. ఈ మధ్యే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రెండోసారి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో ఆయన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్సులున్నట్లు వార్తలొచ్చాయి.
అయితే ఇప్పటివరకు ఆయనకు టికెట్ దక్కలేదు. క్యాన్సర్ కారణంతో బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయడం సుస్పష్టమే అన్నమాట. సుశీల్ క్యాన్సర్ బారిన పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి