Share News

Swati Maliwal case: బిభవ్ కుమార్‌ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:04 PM

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహచరుడు బిభవ్ ‌కుమార్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన జ్యుడిషియల్ కస్టడీని జూలై 16వ తేదీ వరకూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టు శనివారంనాడు పొడిగించింది.

Swati Maliwal case: బిభవ్ కుమార్‌ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal)పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహచరుడు బిభవ్ ‌కుమార్‌(Bibhav Kumar)కు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన జ్యుడిషియల్ కస్టడీని జూలై 16వ తేదీ వరకూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టు శనివారంనాడు పొడిగించింది.

Rahul Gandhi: అయోధ్యలో ఓడించాం, ఇక గుజరాత్ వంతు..


కేజ్రీవాల్ నివాసంలో తనపై బిభవ్ కుమార్ దాడి చేసినట్టు మే 13న స్వాతి మలివాల్ ఆరోపించారు. దీనిపై మే 16న ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మే 18న బిభవ్ కుమార్‌ను అరెస్టు చేశారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ అభ్యర్థనను మే 27న సిటీ కోర్టు తోసిపుచ్చింది. జూన్ 7న తీస్ హజారీ కోర్టు సైతం ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటుండటం, విడిచిపెడితే సాక్ష్యులను తారుమారు చేసే అవకాశం ఉండటంతో బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. దీంతో తన అరెస్టును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును బిభవ్ కుమార్ జూలై 1న ఆశ్రయించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 41ఏ లోని పలు నిబంధనల కింద తన అరెస్టు చట్టవిరుద్ధమని, ముందస్తు బెయులు పిటిషన్ విచారణలో ఉండగా అరెస్టు చేయడం చట్టప్రకారం తనకు సంక్రమించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను అక్రమంగా అరెస్టు చేసినందున తగిన పరిహారం కూడా ఇప్పించాలని కోర్టును కోరారు. తనను అరెస్టు చేయాలని నిర్ణయం తీసుకుని తప్పిదానికి పాల్పడిన అధికారులపై చర్యలు సైతం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

For Latest News and National News click here

Updated Date - Jul 06 , 2024 | 04:04 PM