Home » Swati Maliwal
వెస్ట్ డిల్లీ రాజేందర్ నగర్‌లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోడానికి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ స్వాతి మలివాల్ మండిపడ్డారు. ఈ మరణాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినవి కావని, ఇది 'హత్యే'గానే తాను భావిస్తున్నాని అన్నారు.
ఢిల్లీలో శనివారం కురిసిన భారీ వర్షానికి సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనం బేస్మెంట్లోకి నీరు చేరి.. ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ పై ఢిల్లీ పోలీసులు మంగళవారంనాడు తీస్ హజారీ కోర్టులో ఛార్జిషీటు నమోదు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. దాడి కేసులో బెయిల్ కోసం బిభవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం తిరస్కరించింది.
'ఆప్' రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ బెయిలు అభ్యర్థనపై తీర్పును ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు రిజర్వ్ చేసింది. జూలై 12న తీర్పు ఇవ్వనుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహచరుడు బిభవ్ కుమార్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన జ్యుడిషియల్ కస్టడీని జూలై 16వ తేదీ వరకూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టు శనివారంనాడు పొడిగించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ కు 3 రోజుల పోలీసు కస్టడీకి ఢిల్లీ తీజ్ హజారీ కోర్టు మంగళవారంనాడు ఆదేశించింది.
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సోమవారంనాడు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఒక దశలో కోర్టులోనే స్వాతి మలివాల్ కంటతడి పెట్టారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి తాను రాజీనామా చేయనని, పార్టీ ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు చెందినది కాదని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చెప్పారు. దాడి ఘటన అనంతరం బీజేపీకి చెందిన ఎవరూ తనను కలవలేదని కూడా ఆమె వివరణ ఇచ్చారు.