Taj Mahal: తాజ్‌మహల్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్
ABN , Publish Date - Dec 03 , 2024 | 06:19 PM
తాజ్‌మహల్‌ను పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపుపై తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్టు తాజ్ సెక్యూరిటీ ఎసీపీ సైయద్ అరీబ్ అహ్మద్ తెలిపారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆగ్రా: ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన తాజ్‌మహల్ (Taj Mahal)ను పేల్చేస్తామంటూ మంగళవారంనాడు మెయిల్ బెదిరింపు వచ్చింది. ఉత్తరప్రదేశ్ టూరిజం శాఖకు ఈ మెయిల్ రావడంతో బాంబు నిర్వీర్య దళాలు (బీడీఎస్), స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్‌మహల్ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా అనుమానాస్పద వస్తువేదీ కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Nitin Gadkari: ఢిల్లీకి రావడం ఇష్టం ఉండదు.. ఎందుకో చెప్పిన గడ్కరి
తాజ్‌మహల్‌ను పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపుపై తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్టు తాజ్ సెక్యూరిటీ ఎసీపీ సైయద్ అరీబ్ అహ్మద్ తెలిపారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాగా, ఇటీవల కాలంలో లెక్కకు మిక్కిలిగా విమానాలు, పాఠశాలలు, కాలేజీలకు బాంబు బెదిరింపు మెయిల్స్, ఫోన్‌కాల్ప్ రావడం సంచలనమవుతోంది. నవంబర్ 13 వరకూ దేశీయ విమాన సంస్థలకు సుమారు 1,000 వరకూ బెదిరింపులు వచ్చినప్పుడు ప్రభుత్వం చెబుతోంది. 2022 ఆగస్టు, 2024 నవంబర్ 13 మధ్య 1,143 ఉత్తుత్తి బాంబు బెదిరింపులు నమోదైనట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి మురళీధర్ మొహోల్ నవంబర్ 25న రాజ్యసభలో వెల్లడిచారు ఈ ఏడాది ఒక్క జనవరి-నవంబర్ 13 మధ్య 994 బెదిరింపులు వచ్చాయన్నారు.
ఇవి కూడా చదవండి
Supreme Court: బెయిలు వచ్చిన మరునాడే మంత్రి పదవా...
Heavy Rains: మూడు జిల్లాలను ముంచెత్తిన ‘ఫెంగల్’
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..