Kerala: వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం.. చేతి వేలు తొలగించాలని వెళ్తే నోటికి ఆపరేషన్
ABN , Publish Date - May 16 , 2024 | 07:17 PM
చేతికి అదనంగా ఉన్న వేలు తొలగించాలని తల్లిదండ్రులు తమ కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్తే.. వైద్యులు నిర్లక్ష్యంతో నోటి ఆపరేషన్ చేసిన ఘటన కేరళలో(Kerala) చోటు చేసుకుంది. కోజికోడ్‌కి చెందిన ఓ బాలిక చేతికి అదనంగా మరో వేలు ఉంది.
తిరువనంతపురం: చేతికి అదనంగా ఉన్న వేలు తొలగించాలని తల్లిదండ్రులు తమ కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్తే.. వైద్యులు నిర్లక్ష్యంతో నోటి ఆపరేషన్ చేసిన ఘటన కేరళలో(Kerala) చోటు చేసుకుంది. కోజికోడ్‌కి చెందిన ఓ బాలిక చేతికి అదనంగా మరో వేలు ఉంది.
దాన్ని తొలగించాలని కోరుతూ కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిని ఆమె తల్లిదండ్రులు ఆశ్రయించారు. సర్జరీ ద్వారా ఆరో వేలిని తొలగించవచ్చని ఆ బాలిక పేరెంట్స్‌కు డాక్టర్లు చెప్పారు. దీంతో వారు ఆపరేషన్‌కి అంగీకరించారు. గురువారం ఆపరేషన్ థియేటర్ నుంచి వీల్‌చైయిర్‌లో తీసుకువచ్చిన బాలిక నోటికి ప్లాస్టర్ వేసి ఉంది. అయితే ఆ బాలిక చేతికి ఆరో వేలు ఇంకా ఉంది
దీంతో తల్లిదండ్రులు నర్సును ప్రశ్నించారు. బాలిక నాలుకకు కూడా సమస్య ఉండటంతో డాక్టర్లు ఆపరేషన్ చేశారని నర్సు బుకాయించడానికి ప్రయత్నించింది.
ఆమె మాటలు విని పేరెంట్స్ షాక్‌కి గురయ్యారు. పొరపాటు జరిగిన విషయాన్ని గుర్తించిన వైద్యులు బాలిక తల్లిదండ్రులకు క్షమాపణ కోరారు. ఆమె చేతికి ఉన్న ఆరో వేలిని సర్జరీ ద్వారా తొలగిస్తామని భరోసా ఇచ్చి.. తిరిగి ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. వైద్యుల తీవ్ర నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Latest News and National News