Share News

Tamannaah Bhatia: ఆ కేసులో ఈడీ ఎదుట హాజరైన నటి తమన్నా భాటియా

ABN , Publish Date - Oct 17 , 2024 | 09:00 PM

ఓ బెట్టింగ్ యాప్ కోసం ప్రచారంలో పాల్గొన్నారనే కారణంతో తాజాగా మరో నటికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె నేడు గౌహతిలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Tamannaah Bhatia: ఆ కేసులో ఈడీ ఎదుట హాజరైన నటి తమన్నా భాటియా
Tamannaah Bhatia

ప్రముఖ నటి తమన్నా భాటియాకు(Tamannaah Bhatia) కూడా కష్టాలు మొదలయ్యాయి. అవును స్పెషల్ సాంగ్స్‌తో ఇటివల ఫోకస్ అయిన ఈ నటి పేరు ఇప్పుడు ఓ బెట్టింగ్ యాప్ కేసులో తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో నటిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గౌహతి కార్యాలయంలో విచారించింది. మహదేవ్ ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ అప్లికేషన్ సపోర్టింగ్ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చట్టవిరుద్ధంగా వీక్షించడాన్ని ప్రోత్సహించినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి.

ఐదు గంటలు

ఈ నేపథ్యంలో ఇటివల ఈడీ తమన్నాకు సమన్లు జారీ చేయగా, మధ్యాహ్నం 1.30 గంటలకు గౌహతిలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె తల్లి కూడా ఆమెతో వచ్చింది. ఈ నటి ఫెయిర్‌ప్లే బెట్టింగ్ యాప్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను చూడడాన్ని ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను దాదాపు ఐదు గంటలపాటు విచారించారు. అంతేకాదు ఇటీవల 'స్త్రీ 2' చిత్రంతో తమన్నా వార్తల్లో నిలిచింది. అందులో ఆమె 'ఆజ్ కీ రాత్' పాటతో ఫుల్ ఫేమస్ అయ్యింది.


ఈ యాప్‌కు ప్రచారం

ఈ సందర్భంలో తమన్నా భాటియాను నిందితురాలిగా విచారించడం లేదు. కానీ HPZ యాప్‌కు ప్రచారం చేసినందుకు విచారిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ప్రజలు రూ. 57,000 పెట్టుబడి పెడితే రోజుకు రూ.4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. దీని ద్వారా కోట్లాది మంది డబ్బులు పెట్టి మోసపోయారు. మోసం చేసేందుకు డొల్ల కంపెనీల పేరుతో వివిధ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి పెట్టుబడిదారుల నుంచి నగదు బదిలీ చేశారు.

నిందితులు ఈ డబ్బును క్రిప్టో, బిట్‌కాయిన్లలో పెట్టుబడి పెట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు రూ. 497.20 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ విషయం కూడా మహాదేవ్ యాప్ స్కామ్‌తో ముడిపడి ఉంది. ప్రజలు దీని ద్వారా డబ్బు సంపాదించి మహాదేవ్ బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టేవారు.


గతంలో కూడా

ఇదివరకు కూడా తమన్నా భాటియా ఈ ఆరోపణలపై ఓసారి హాజరైంది. అది కూడా బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన అంశం. మహదేవ్ బెట్టింగ్ అప్లికేషన్‌కు అనుబంధంగా ఉన్న ఫెయిర్‌ప్లే యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రమోట్ చేశారనే ఆరోపణలపై నటిని మహారాష్ట్ర సైబర్ సెల్ సమన్లు జారీ చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపు రూ. 15 వేల కోట్ల కుంభకోణంపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ యాప్ క్రికెట్ టోర్నమెంట్ అధికారిక ప్రసార సంస్థ వయాకామ్ 18 అనుమతి లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌లను చట్టవిరుద్ధంగా ప్రసారం చేసి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించిందని వెలుగులోకి వచ్చింది.


ఇవి కూడా చదవండి:

Train Accident: అగర్తల-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. పట్టాలు తప్పిన 8 కోచ్‌లు

Lay Offs: మళ్లీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో లే ఆఫ్స్.. భయాందోళనలో టెకీలు..


Firecracker Insurance: ఫైర్‌క్రాకర్స్‌తో గాయపడితే ఇన్సూరెన్స్ పాలసీ.. ఫోన్ పే నుంచి కొత్త స్కీం..

Gold Investment: ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్.. వీటిలో ఏ పెట్టుబడి బెస్ట్


Business Idea: రైల్వేలో ఈ బిజినెస్ చేయండి.. వేల సంపాదనతోపాటు..


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 17 , 2024 | 09:20 PM