Share News

Nitish Touch Modi Feet: ఇదొక సిగ్గుమాలిన చర్య.. అసలు నితీశ్‌కు ఏమైంది?

ABN , Publish Date - Apr 08 , 2024 | 09:03 AM

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అసలు నితీశ్‌కు అంత దుస్థితి ఏమొచ్చిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

Nitish Touch Modi Feet: ఇదొక సిగ్గుమాలిన చర్య.. అసలు నితీశ్‌కు ఏమైంది?

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అసలు నితీశ్‌కు అంత దుస్థితి ఏమొచ్చిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఈ పరిణామంపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ఫోటోని చూసి తాను ఆశ్చర్యానికి గురవ్వడంతో పాటు అవమానకరంగా అనిపించిందని పేర్కొన్నారు. ఎంతో అనుభవజ్ఞుడైన నితీశ్‌కు ఏమైందంటూ ప్రశ్నించారు.

మొజాంబిక్ తీరంలో విషాదం.. బోటు మునిగి 91 మంది మృతి


‘‘ప్రధాని మోదీ పాదాలను నితీశ్ తాకిన ఫోటోని నేను చూశాను. అది చూడగానే నేను ఎంతో అవమానకరంగా భావించాను. అసలు నితీశ్‌కు ఏమైంది? ఆయన మాకు ఓ మార్గదర్శకుడు. ఓ రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా నితీశ్‌కు ఎంతో అనుభవం ఉంది. అసలు ఆయనకున్నంత ఎక్స్‌పీరియన్స్ ఏ ఇతర ముఖ్యమంత్రికీ లేదని చెప్పుకోవడంలో సందేహం లేదు. అలాంటి నితీశ్ ప్రధాని పాదాలను తాకుతున్నాడు. ఇదొక సిగ్గుమాలిన చర్య’’ అని తేజస్వి యాదవ్ చెప్పారు. నితీశ్ లాంటి ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకుడికి మోదీ పాదాలను నమస్కరించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల ఆయన ఇమేజ్ దెబ్బతింటుందన్న కామెంట్లు సైతం వచ్చిపడుతున్నాయి.

విజయానికి ఒక్క అడుగు దూరంలోనే.. అప్పటిదాకా తగ్గేదేలేదన్న ఇజ్రాయెల్ ప్రధాని

ఇదే సమయంలో.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ 4వేల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని వ్యాఖ్యలు చేయడంతో నితీష్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. మొదట్లో ఆయన నాలుగు లక్షలు అని చెప్పబోయారు. ఇంతలో తన తప్పుని సరిదిద్దుకొని నాలుగు వేల సీట్లు అని పేర్కొన్నారు. ఈసారి ఎన్డీఏ 400 సీట్లు సాధిస్తుందని బీజేపీ నినాదాన్ని ఉద్దేశిస్తూ.. నితీశ్ ఆ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆర్జేడీ వెంటనే వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రధానికి నాలుగు లక్షల కంటే ఎక్కువ మంది ఎంపీలు కావాలని నితీశ్ కోరినట్లు అనిపించిందని, అయితే ఆ సంఖ్య మరీ ఎక్కువ భావించి నాలుగు వేలు సరిపోతాయని భావించి ఉంటారంటూ ఆర్జేడీ అధికార ప్రతినిధి సారిక పాశ్వాన్ సెటైర్లు వేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 08 , 2024 | 09:46 AM