Share News

Road Accident: యూపీలో ఘోరం.. రాఖీ వేడుకలని వెళ్తూ అనంతలోకాలకు

ABN , Publish Date - Aug 18 , 2024 | 07:01 PM

ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. బస్సు, వ్యాను ఢీకొనడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Road Accident: యూపీలో ఘోరం.. రాఖీ వేడుకలని వెళ్తూ అనంతలోకాలకు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. బస్సు, వ్యాను ఢీకొనడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బులంద్‌షహర్‌లోని సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని బ్రెడ్ కంపెనీలో పనిచేస్తున్న 35 మంది కార్మికులు అలీగఢ్‌ జిల్లా అత్రౌలీ తహసీల్ రాయ్‌పుర్ గ్రామానికి వెళ్తున్నారు. అనంతరం వారంతా కలిసి మినీ వ్యానులో బయల్దేరారు.

బులంద్‌షహర్ జిల్లాకు చేరుకోగానే వారి వ్యానును ఎదురుగా వస్తున్న బస్సు వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాను నుజ్జయింది. అందులో ఉన్న 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు స్టీరింగ్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. స్థానికులు గుర్తించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం చేరవేశారు. క్షతగాత్రులను స్థానికులు జిల్లా ఆసుపత్రికి చేరవేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్రేన్ సాయంతో బస్సులో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.


నిరసనలు..

ప్రమాదం జరిగిన తీరును చూసి బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఉదయం 10.15 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని.. పోలీసులకు సమాచారం అందించగా అరగంట ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకున్నారని స్థానికులు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యంతో బాధితుల సంఖ్య మరింతగా పెరిగిందని తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిని దిగ్బంధించారు. కాగా పోలీసులు అక్కడికి చేరుకుని.. వారికి సర్దిచెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

For Latest News and National News click here

Updated Date - Aug 18 , 2024 | 07:01 PM