Share News

Washington: ఉగ్రవాది గోల్డీ బ్రార్‌ హత్య

ABN , Publish Date - May 02 , 2024 | 04:45 AM

గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో కీలక నిందితుడు, బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ ఉగ్రవాది గోల్డీ బ్రార్‌(30) అమెరికాలో హత్యకు గురయ్యాడు.

Washington: ఉగ్రవాది గోల్డీ బ్రార్‌ హత్య

కాలిఫోర్నియాలో కాల్చి చంపిన దుండగులు

వాషింగ్టన్‌, మే 1: పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో కీలక నిందితుడు, బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ ఉగ్రవాది గోల్డీ బ్రార్‌(30) అమెరికాలో హత్యకు గురయ్యాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం కాలిఫోర్నియాలోని ఫెయిర్‌ మాంట్‌లో ఉన్న హోల్ట్‌ అవెన్యూలో ఓ ఇంటి ముందు తన స్నేహితుడితో కలిసి నిలబడ్డ గోల్డీ బ్రార్‌పై గుర్తుతెలియని దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు.


ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన గోల్డీ బ్రార్‌, అతని స్నేహితుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. గోల్డీ బ్రార్‌ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. గోల్డీ బ్రార్‌ హత్యకు తమదే బాధ్యత అని ఆయన ప్రత్యర్థులు ఆర్ష్‌ దల్లా, లఖ్బీర్‌ ప్రకటించారు. గోల్డీబ్రార్‌ స్వస్థలం పంజాబ్‌లోని శ్రీముక్త్‌సర్‌ సాహిబ్‌. 1994లో జన్మించారు. తన సోదరుడు గురులాల్‌ బ్రార్‌ను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువజన కాంగ్రెస్‌ నేత గురులాల్‌ పహిల్వాన్‌ను 2021 ఫిబ్రవరి 8న హతమార్చాడు.


ఆ తర్వాత విద్యార్థి వీసాపై కెనెడాకు పారిపోయాడు. 2021 ఆగస్టులో మొహాలీలో గోల్డీ మరో సోదరుడు విక్కీ మిద్దూఖేరా(గ్యాంగ్‌స్టర్‌) హత్యకు గురయ్యాడు. ఆ కేసులో గాయకుడు సిద్ధూ మూసేవాలా మేనేజర్‌ షాగన్‌ ప్రీత్‌సింగ్‌ ప్రధాన నిందితుడు. దీంతో గోల్డీ బ్రార్‌ కెనడా నుంచి మూసేవాలా హత్యకు స్కెచ్‌ వేశాడు. 2022 మే 29న మూసేవాలాను హతమార్చాడు.

Updated Date - May 02 , 2024 | 04:45 AM