Share News

కశ్మీర్‌లో ఉగ్రదాడి

ABN , Publish Date - Oct 21 , 2024 | 02:52 AM

జమ్మూ-కశ్మీర్‌లో ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు మళ్లీ తెగబడ్డారు. గందేర్‌బల్‌ జిల్లాలోని గగన్‌గిర్‌ వద్ద ఓ ప్రయివేటు కంపెనీ సిబ్బంది ఉంటున్న స్థావరం కాల్పులు జరిపారు.

కశ్మీర్‌లో ఉగ్రదాడి

  • వైద్యుడు, ఐదుగురు వలస కార్మికుల మృతి

శ్రీనగర్‌, అక్టోబరు 20: జమ్మూ-కశ్మీర్‌లో ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు మళ్లీ తెగబడ్డారు. గందేర్‌బల్‌ జిల్లాలోని గగన్‌గిర్‌ వద్ద ఓ ప్రయివేటు కంపెనీ సిబ్బంది ఉంటున్న స్థావరం కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ వైద్యుడుతో పాటు, అయిదుగురు వలస కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ కార్మికులు గగన్‌గీర్‌ నుంచి సోనామార్గ్‌ వరకు చేపడుతున్న జడ్‌-మోర్హ్‌ సొరంగం పనుల్లో పాల్గొంటున్నారు. శుక్రవారమే సోఫియాన్‌ జిల్లాలో బిహార్‌కు చెందిన వలస కార్మికుడిని కూడా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏప్రిల్‌ నెలలోనూ అనంత్‌నాగ్‌ జిల్లాలో పనిచేస్తున్న ఓ వలస కార్మికుడిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఇందుకు తమదే బాధ్యత అని లష్కర్‌ ఎ తోయిబా ప్రకటించుకొంది. స్థానికేతర కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఖండించారు. ఈ దాడి అమానుషమని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 21 , 2024 | 02:52 AM