Air India: రన్‌వేపై ట్రగ్ ట్రాక్టర్‌ను ఢీకొట్టిన విమానం.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
ABN , Publish Date - May 17 , 2024 | 01:25 PM
ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పుణె విమానాశ్రయం నుంచి 180 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది. పుణె విమానాశ్రయంంలో రన్‌వే దిశగా వెళుతున్న తరుణంలో లగేజీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు.
పుణె: ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పుణె విమానాశ్రయం నుంచి 180 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది. పుణె విమానాశ్రయంంలో రన్‌వే దిశగా వెళుతున్న తరుణంలో లగేజీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. అయితే వారికి ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. అయితే టగ్ ట్రాక్టర్‌ను ఢీకొనడం వల్ల విమానం ముక్కు భాగం డ్యామేజ్ అయ్యింది. అలాగే ల్యాండింగ్ గెయిర్‌కు చెందిన టైరు కూడా స్వల్పంగా దెబ్బతిన్నది.
పిన్నెల్లిని అరెస్ట్ చేస్తేనే దాడులు ఆగుతాయి: చంద్రబాబు
ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపారు. అనంతరం ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండిపోవడంతో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ట్రాక్టర్‌ను విమానం ఢీకొన్న విషయమై విచారణ ప్రారంభించినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. అయితే ట్రగ్ ట్రాక్టర్‌ను డీకొట్టిన విమానాన్ని మరమ్మతుల కోసం ఎయిర్ ఇండియా సంస్థ తరలించింది. విమాన ప్రమాద నేపథ్యంలో కార్యకలాపాలకు ఎలాంటి అవరోధమూ లేకుండా సంస్థ చర్యలను చేపట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పల్నాడు జిల్లా: సర్పంచ్ ఇంటిపై వైసీపీ దాడి..
విధుల్లో చేరిన గంగవరం పోర్ట్ ఉద్యోగులు
పవన్ కళ్యాణ్ గెలుపుపై కోట్లలో బెట్టింగ్