Share News

Elon Musk : పూర్తిగా ‘ఎక్స్‌’గా మారిన ట్విటర్‌

ABN , Publish Date - May 18 , 2024 | 05:11 AM

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ ఇక పూర్తిగా ‘ఎక్స్‌’గా మారిపోయింది. ట్విటర్‌ పేరును ఎక్స్‌గా మారుస్తున్నట్లు ఆ సంస్థ అధినేత ఈలన్‌ మస్క్‌ గతంలోనే ప్రకటించి లోగోను మార్చినా..

Elon Musk : పూర్తిగా ‘ఎక్స్‌’గా మారిన ట్విటర్‌

పారిస్‌, మే 17: సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ ఇక పూర్తిగా ‘ఎక్స్‌’గా మారిపోయింది. ట్విటర్‌ పేరును ఎక్స్‌గా మారుస్తున్నట్లు ఆ సంస్థ అధినేత ఈలన్‌ మస్క్‌ గతంలోనే ప్రకటించి లోగోను మార్చినా.. ఆ సంస్థ వెబ్‌సైట్‌ మాత్రం ట్విటర్‌ పేరుతోనే కొనసాగుతూ వచ్చింది. తాజాగా వెబ్‌సైట్‌ పేరును కూడా ‘‘x.com’’ గా మార్చివేశారు. ఈ విషయాన్ని మస్క్‌ శుక్రవారం ప్రకటించారు. మస్క్‌ 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేశారు. గతేడాది జూలైలో ఆ సంస్థ పేరును ఎక్స్‌గా మార్చారు. కాగా, ఎక్స్‌ను చైనాకు చెందిన సోషల్‌ మీడియా యాప్‌ ‘వీ చాట్‌’కు దీటుగా తీర్చిదిద్దుతానని మస్క్‌ ప్రకటించారు. వీచాట్‌లో వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ బుకింగ్‌, పేమెంట్లు చేయవచ్చు. .

Updated Date - May 18 , 2024 | 10:57 AM