Share News

PM Modi: కొలిక్కి వచ్చిన కేంద్ర మంత్రి మండలి.. మంత్రులకు ప్రధాని తేనీటి సమావేశం

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:37 AM

న్యూఢిల్లీ: ఎట్టకేలకే కేంద్ర మంత్రి మండలి కూర్పు ఓ కొలిక్కి వచ్చింది. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారానికి ముందు మంత్రులందరికీ ప్రధాని నివాసానికి పిలుపిచ్చారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారితో నరేంద్రమోదీ నివాసంలో తేనీటి సమావేశం ఏర్పాటు చేశారు.

PM Modi:  కొలిక్కి వచ్చిన కేంద్ర మంత్రి మండలి.. మంత్రులకు ప్రధాని తేనీటి సమావేశం

న్యూఢిల్లీ: ఎట్టకేలకే కేంద్ర మంత్రి మండలి (Union Council of Ministers) కూర్పు ఓ కొలిక్కి వచ్చింది. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారానికి ముందు మంత్రులందరికీ ప్రధాని నివాసానికి పిలుపిచ్చారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారితో నరేంద్రమోదీ (PM Modi) నివాసంలో తేనీటి సమావేశం (Meeting) ఏర్పాటు చేశారు. నిన్న (శనివారం) రోజంతా మంత్రుల కూర్పుపై బీజేపీ అగ్ర నాయకత్వం (BJP Top Leadership) సుదీర్ఘ కసరత్తు జరిపింది. కసరత్తులో భాగస్వామ్యమైన రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) నేతలు, ప్రధాని మోదీ, అమిత్ షా (Amit shah), జేపీ నడ్డా (JP Nadda), రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తదితరులు దాదాపు 9 గంటల పాటు చర్చలు జరిపారు.


మిత్రపక్షాల్లో ఎవరికెన్ని శాఖలు కేటాయించాలన్న విషయంపై స్పష్టత వచ్చింది. 5గురు కంటే ఎక్కువ సభ్యులున్న మిత్రపక్షాలకు ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి.. తెలుగుదేశం, జనతాదళ్ (యునైటెడ్), శివసేన (షిండే వర్గం), లోక్ జనశక్తి (పాశ్వాన్) పార్టీలకు కేబినెట్ పదవులు.. రెండు, మూడు ఎంపీలు ఉన్నవారికి ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వడానికి నిర్ణయించారు. ఇప్పటివరకు పార్టీ బాధ్యతలు నిర్వహించిన వారికి ప్రభుత్వంలో పాత్ర కల్పిస్తారు. లోక్‌సభకు ఎన్నికైన నలుగురు మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, బస్వరాజ్ బొమ్మైలకు తగు ప్రాధాన్యత ఇస్తారు. వారిలో ఒకరిని స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది.


బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలం ముగుస్తున్నందున ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. బీజేపీ చేతిలోనే కీలకమైన రక్షణ, హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు సహా విద్య, సాంస్కృతిక శాఖలు ఉంచుకున్నారు. పట్టణాభివృద్ధి, ఐటి, సామాజిక న్యాయ శాఖలను తెలుగుదేశంకు, రైల్వేలు, వ్యవసాయ శాఖలు జేడీ(యూ)కి కేటాయించే అవకాశముంది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్, మహారాష్ట్రలకు బీజేపీ తగిన ప్రాతినిధ్యం ఇవ్వనుంది. కేంద్ర కేబినెట్‌లో మిత్రపక్షాల నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ప్రఫుల్ పటేల్, చిరాగ్ పాశ్వాన్, అనుప్రియ పటేల్, జయంత్ చౌదరి, జతిన్ రామ్ మాంఝీ, కుమార స్వామి తదితరులకు చోటు కల్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దేశ రాజకీయాల్లో రాహుల్ ఓ అగ్ని పర్వతం

ఆ రాత్రి చేసిన తప్పే.. జగన్ ఓటిమికి కారణం..

వైఎస్ జగన్ ఈవీఎంలపై నెపం...

ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

మోదకొండమ్మ జాతర మోహోత్సవాలు ప్రారంభం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 09 , 2024 | 11:40 AM