Share News

PM Modi: మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం జరగాలి

ABN , Publish Date - Aug 31 , 2024 | 01:54 PM

మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం జరగాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నొక్కి చెప్పారు. సత్వర న్యాయం అనేది మహిళల భరోసాకు భద్రత ఇస్తుందని అన్నారు.

PM Modi: మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం జరగాలి

ఢిల్లీ: మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం జరగాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నొక్కి చెప్పారు. సత్వర న్యాయం అనేది మహిళల భరోసాకు భద్రత ఇస్తుందని అన్నారు. ఢిల్లీలో రెండు రోజుల న్యాయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థను రాజ్యాంగ పరిరక్షకులుగా పరిగణిస్తున్నారని, సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థలు బాధ్యతగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల భద్రతపై సమాజంలో తీవ్రమైన ఆందోళన నెలకొందన్నారు. దేశంలో మహిళల భద్రత కోసం అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయన్నారు. 2019 లో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిందని మోదీ అన్నారు.


ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విషయంలో జిల్లా మానిటరింగ్ కమిటీల పాత్ర చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. జిల్లా మానిటరింగ్ కమిటీల్లో డిస్ట్రిక్ట్ జడ్జ్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఉంటారన్నారు. న్యాయ వ్యవస్థలోని వివిధ అంశాల మధ్య సమన్వయం చేయడంలో జిల్లా కమిటీల పాత్ర చెప్పుకోదగినదని అన్నారు. జిల్లా కమిటీలు చురుకుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా అత్యాచార ఘటనల్లో వీలైనంత త్వరగా న్యాయం జరగాలన్నారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల ప్రయాణంతో పాటు భారత ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ పై ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉందన్నారు. సుప్రీంకోర్టుపై కానీ న్యాయవ్యవస్థపై కానీ ఎవరూ ఎప్పుడూ అవిశ్వాసంగా మాట్లాడలేదన్నారు. మన దేశంలో న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి రక్షణగా నిలుస్తుందని మోదీ అన్నారు.


ఎమర్జెన్సీ విధించడాన్ని ‘చీకటి’ కాలంగా అభివర్ణించిన ప్రధాని, ప్రాథమిక హక్కులను కాపాడటంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషించిందని మోదీ అన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలపై, జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా న్యాయవ్యవస్థ జాతీయ సమగ్రతను కాపాడిందని కొనియాడారు. గత పదేళ్లలో కోర్టుల మోడరనైజేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఈ రెండు రోజుల న్యాయ సదస్సులో చాలా కీలకమైనటువంటి చర్చ జరగనుందని మోదీ అన్నారు. 140 కోట్ల దేశ ప్రజల సంకల్పం ఒకటేనని.. అదే వికసిత్ భారత్ అని అన్నారు. భారత న్యాయ వ్యవస్థకు జిల్లా కోర్టులు చాలా కీలకమని పేర్కొన్నారు. జిల్లా కోర్టుల్లో నాలుగున్నర కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మోదీ తెలిపారు.

Updated Date - Aug 31 , 2024 | 01:54 PM