Lok sabha election Result: ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీ.. స్పందించిన విదేశీ మీడియా
ABN , Publish Date - Jun 05 , 2024 | 07:37 PM
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్డీయే కూటమి 293 స్థానాలను గెలుచుకుంది. అలాగే ఇండియా భాగస్వామ్య పక్షాలు 233 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇతరులు 17 స్థానాల్లో గెలిచారు. దీంతో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు ముహూర్తం సైతం ఖరారు అయింది.
న్యూఢిల్లీ, జూన్ 05: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్డీయే కూటమి 293 స్థానాలను గెలుచుకుంది. అలాగే ఇండియా భాగస్వామ్య పక్షాలు 233 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇతరులు 17 స్థానాల్లో గెలిచారు. దీంతో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు ముహూర్తం సైతం ఖరారు అయింది.
అయితే ఈ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాల్లో గెలుస్తామని ప్రకటించిన బీజేపీ అగ్ర నాయకత్వానికి ఈ ఫలితాలు మింగుడు పడని అంశంగా మారాయనేది సుస్పష్టం. ఇక ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కాకుండా ఒక్క బీజేపీకే 240 స్థానాల్లో మాత్రమే గెలిచింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మిత్ర పక్షాలు అవసరం ఉందన్నది సుస్పష్టం.
మరోవైపు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి బలం పుంజుకున్న సంకేతాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపించాయి. అలాంటి వేళ ప్రధానిగా మోదీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో విదేశీ మీడియా సైతం తనదైన శైలిలో స్పందించింది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. ప్రాంతీయ పార్టీలతో మాత్రం కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పొరుగునున్న దాయాది దేశం పాకిస్థాన్ పత్రిక డాన్ అభిప్రాయపడింది. ఈ ఎన్నికల్లో మెజార్టీ మార్కును మోదీ దాట లేకపోయారని.. కానీ ఆయన ప్రధాని పదవి అందుకొనేందుకు సిద్దమయ్యారంటూ పాకిస్థాన్ జియో టీవీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇక మోదీకి మిత్రపక్షాల అవసరం వచ్చిందని రాయటర్స్ వార్త సంస్థ వెల్లడించింది. ఇక ఈ ఎన్నికలు ప్రధాని మోదీకి ఆశ్చర్యకర ఫలితాలను మిగిల్చాయని జర్మనీ మీడియా డీడబ్ల్యూ తెలిపింది. అలాగే ఈ ఎన్నికల్లో మోదీ మెజార్టీని కోల్పోయారని లండన్ పత్రిక ది గార్డియన్ స్పష్టం చేసింది. అదే విధంగా మోదీ ప్రభంజనానికి బ్రేక్‌లు పడ్డాయని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేసింది.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News