Share News

Arvind Kejriwal: జెండా ఎగురవేయడంపై ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ.. జైలు అధికారులు అభ్యంతరం

ABN , Publish Date - Aug 12 , 2024 | 03:56 PM

జైలు నిబంధనలకు విరుద్ధంగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆగస్టు 6న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాయడంపై తీహార్ జైలు అధికారులు అభ్యంతరం తెలిపారు.

Arvind Kejriwal: జెండా ఎగురవేయడంపై ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ.. జైలు అధికారులు అభ్యంతరం

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi excise cpolicy) కేసులో ఆరోపణలపై తీహార్ జైలుకు వెళ్లినప్పటి నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) పలు ఆరోపణలు సంధిస్తూనే ఉన్నారు. జైలులోనే తనను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ ఇటీవల ఆయన చేసిన ఆరోపణలను జైలు అధికారులు కొట్టివేశారు. తాజాగా కేజ్రీవాల్ చర్యను జైలు అధికారులు తప్పుపట్టారు. జైలు నిబంధనలకు విరుద్ధంగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆగస్టు 6న కేజ్రీవాల్ లేఖ రాసినట్టు వారు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ (Independence Day) వేడుకలో త్రివర్ణ పతాకాన్ని మంత్రి అతిషి ఎగురవేస్తారంటూ ఎల్జీకి లేఖ రాయడం ఢిల్లీ జైలు నిబంధనలకు విరుద్ధమని అధికారులు చెప్పారు.


ఢిల్లీ ప్రిజన్ రూల్స్‌-2018 నిబంధలను విరుద్ధంగా సీఎం ప్రవర్తించ రాదని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఆయనకు ఉన్న అధికారాలను కుదించాల్సి వస్తుందని తీహార్ జైల్ నెంబర్ 2 సూపరింటెండెంట్ ముఖ్యమంత్రికి సూచించారు. లేఖలోని విషయాలను ఎలాంటి అథారిటీ లేకుండా మీడియాకు లీక్ కావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది జైలు నిబంధనల కింద ఆయనకు కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేయడమేనని పేర్కొన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సీఎంకు సూచించారు.

Kolkata Trainee Doctor Case: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా


ఎల్జీ కార్యాలయం ఏం చెప్పిందంటే...

కాగా, ముఖ్యమంత్రి నుంచి తమకు ఎలాంటి సమాచారం (లేఖ) అందలేదని ఎల్జీ కార్యాలయం తెలిపింది. ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబధించి సీబీఐ కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నరు. ఈడీ నమోదు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 12 , 2024 | 03:56 PM