Ayodhya Ramalayam: తిరుపతి లడ్డూ వివాదం.. స్పందించిన ఆచార్య సత్యేంద్రే దాస్
ABN , Publish Date - Sep 21 , 2024 | 03:13 PM
గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల అవశేషాలను నుంచి తీసిన కొవ్వును వినియోగించారంటూ ఎన్‌డీడీబీ నివేదిక సైతం స్పష్టం చేసింది. దీంతో తిరుపతి లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అలాంటి వేళ.. ఈ అంశంపై అయోధ్య రామమందిరం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రే దాస్ స్పందించారు.
అయోధ్య, సెప్టెంబర్ 21: గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల అవశేషాలను నుంచి తీసిన కొవ్వును వినియోగించారంటూ ఎన్‌డీడీబీ నివేదిక సైతం స్పష్టం చేసింది. దీంతో తిరుపతి లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అలాంటి వేళ.. ఈ అంశంపై అయోధ్య రామమందిరం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రే దాస్ శనివారం స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: Manipur: భారీగా ప్రవేశించిన తీవ్రవాదులు: దాడులకు అవకాశం
Also Read: Anna Sebastian: సెబీ జోసఫ్‌ను కలిసిన ఎంపీ శశిథరూర్
ఈ ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలా రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిందన్నారు. ఆ సమయంలో దాదాపు లక్ష తిరుపతి లడ్డులను తిరుమల తిరుపతి దేవస్థానం అయోధ్యకు పంపిందన్నారు. రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తరలి వచ్చిన భక్తులకు ఈ తిరుపతి లడ్డూలను ప్రసాదంగా పంచినట్లు తెలిపారు. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన భక్తులకు తాము మాత్రం యాలుకల గింజలు పంపినట్లు చెప్పారు.
Also Read: తాడేపల్లి టు బెంగళూరు.. షటిల్ సర్వీస్
Also Read: Delhi CM: నేడు సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం
Also Read: Kolkata: ముగిసిన సమ్మె.. నేటి నుంచి విధుల్లోకి జూనియర్ డాక్టర్లు
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు వేలాది మంది ప్రముఖుల సైతం హాజరయ్యారని పేర్కొన్నారు. మరోవైపు లడ్డూ వ్యవహారంపై కేంద్రం సైతం స్పందించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా.. స్వయంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి.. ఈ అంశంపై ఆరా తీశారు. తమకు నివేదిక అందజేయాలని ఈ సందర్భంగా చంద్రబాబుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా సూచించిన విషయం విధితమే.
For More National News And Telugu News...