Share News

Tomato: మళ్లీ పెరిగిన టమోటా ధర.. కిలో ఎంతంటే...

ABN , Publish Date - Jun 18 , 2024 | 01:02 PM

నిన్న, మొన్నటి వరకు ధరలు లేక డీలా పడిన టమోటా రైతులు పెరిగిన ధరలతో ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా హోసూరు మార్కెట్లో(Hosur Market) టమోటా ధరలు భారీగా పలుకుతున్నాయి.

Tomato: మళ్లీ పెరిగిన టమోటా ధర.. కిలో ఎంతంటే...

- అధిక లాభాలతో రైతుల్లో హర్షం

హోసూరు(చెన్నై): నిన్న, మొన్నటి వరకు ధరలు లేక డీలా పడిన టమోటా రైతులు పెరిగిన ధరలతో ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా హోసూరు మార్కెట్లో(Hosur Market) టమోటా ధరలు భారీగా పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో టమోటా కిలో రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. ఇక మార్కెట్లో రైతులకు మంచి ధర పలుకుతోంది. 15 కిలోల ట్రే రూ.700 నుంచి రూ.1000 వరకు అమ్ముడుబోతోంది. హోసూరు(Hosur) జిల్లాలోని ఎంకనీకోట, కెలమంగలం, తళి, ప్రాంతాల్లో టమోటా అధికంగా సాగు చేస్తున్నారు. జిల్లాలో 5వేల ఎకరాల్లో పైగా టమోటా సాగు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Bangalore: భారీ వర్షాలకు నిండిన ‘తుంగ’ జలాశయం..


వారం కింద రూ.10 ఉన్న టమోటా ఏకంగా రూ.80కి చేరింది. టమోటకు వ్యాధి సోకడమే కారణమని తెలుస్తోంది. దీని ప్రభావంతో మార్కెట్‌కు పంట రావడం తగ్గిపోయింది. హోసూరు మార్కెట్‌కు రోజూ 8 టన్నుల వరకు టమోటాలు వచ్చేవి. ప్రస్తుతం ఎండలు, రోగాలు సోకడంతో సరఫరా తగ్గి ఇప్పుడు ధరలు అధికమయ్యాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. అరకొర పంట పండిన రైతులు మాత్రం అధిక లాభాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 01:22 PM