Share News

Traffic signals: ‘లవ్‌ సింబల్స్‌’ తరహాలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌

ABN , Publish Date - Aug 06 , 2024 | 11:41 AM

‘వరల్డ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ డే’(World Traffic Signals Day)ను పురస్కరించుకుని నగరంలోని ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద వెలిగే లైట్లను లవ్‌ సింబల్‌(Love symbol) తరహాలో అమర్చుతున్నారు. ఇవి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యంపై వాహనచోదకుల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా నగర ట్రాఫిక్‌ పోలీసులు ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

Traffic signals: ‘లవ్‌ సింబల్స్‌’ తరహాలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌

చెన్నై: ‘వరల్డ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ డే’(World Traffic Signals Day)ను పురస్కరించుకుని నగరంలోని ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద వెలిగే లైట్లను లవ్‌ సింబల్‌(Love symbol) తరహాలో అమర్చుతున్నారు. ఇవి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యంపై వాహనచోదకుల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా నగర ట్రాఫిక్‌ పోలీసులు ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వరల్డ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ డే ను సోమవారం ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనచోదకుల్లో ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించేలా ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌(Police Commissioner Arun) ఆదేశించారు.

ఇదికూడా చదవండి: BJP state president: నా పాదయాత్రతో ప్రభుత్వానికి ముచ్చెమటలు..


aa.jpg

దీంతో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ సుధాకర్‌ సారథ్యంలో గ్రేటర్‌ చెన్నై పోలీస్‌(Greater Chennai Police) పరిధిలోని అన్నాశాలై, కామరాజర్‌ శాలైతో సహా పలు ప్రధాన రహదారుల్లో ఉన్న ట్రాఫిక్‌ సిగ్నెల్స్‌లో ఉండే లైట్లను లవ్‌ సింబల్స్‌ తరహాలో డిజైన్‌ చేసి అమర్చారు. ముఖ్యంగా గిండి ట్రాఫిక్‌ సీఐ విజయలక్ష్మి, ట్రిప్లికేణి ట్రాఫిక్‌ సీఐ సుబ్రమణియన్‌ సారథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు వాహనచోదకులకు అవగాహన కల్పించారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో ఉన్న ట్రాఫిక్‌ సిగ్నెల్‌ లైట్లు హృదయం ఆకారంలో వెలగుతూ కనిపించడంతో వాహనచోదకులు సైతం ఆసక్తిగా చూశారు.


ఇది చరిత్ర..

ప్రపంచ ట్రాఫిక్ సిగ్నల్ దినోత్సవం సందర్భంగా చెన్నైలోని అన్నారోడ్, కామరాజర్ రోడ్ సహా ప్రధాన రహదారులపై చెన్నై ట్రాఫిక్ పోలీసులు లవ్ సింబల్‌లా సిగ్నల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రపంచ ట్రాఫిక్ సిగ్నల్ దినోత్సవానికి ఓ చరిత్ర ఉంది. రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు సేఫ్టీ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను అనుసరించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చు. ఇదే కాన్సెప్ట్‌తో ట్రాఫిక్ లైట్లను అమెరికాలోని ఓహియోలో మొదటిసారిగా తీసుకొచ్చారు. ఆగష్టు 5, 1914న, USAలోని ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లోని యూక్లిడ్ అవెన్యూలో జేమ్స్ మొదటి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ సిగ్నల్‌ను ఏర్పాటు చేశాడు.

అయితే... మొట్టమొదట జేమ్స్ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ లైట్లను స్మరించుకోవడానికి సోమవారం (ఆగస్టు 5) ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ట్రాఫిక్ లైట్ డేగా పాటిస్తున్నారు.

aaa.jpg


ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!

Updated Date - Aug 06 , 2024 | 12:03 PM