South Central Railway : క్యూఆర్ కోడ్‌తో రైలు టిక్కెట్
ABN , Publish Date - Aug 15 , 2024 | 04:31 AM
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్‌లలో క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ సదుసాయంతో టిక్కెట్లను కొనుగోలుచేసే అవకాశం కలిగింది. మొదట్లో ఎంపిక చేసిన ప్రధాన స్టేషన్‌లలోనే ఈ
ద.మ. రైల్వేలో అన్ని స్టేషన్లలో అమలు
హైదరాబాద్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్‌లలో క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ సదుసాయంతో టిక్కెట్లను కొనుగోలుచేసే అవకాశం కలిగింది. మొదట్లో ఎంపిక చేసిన ప్రధాన స్టేషన్‌లలోనే ఈ సౌకర్యాన్ని కలిగించగా, ప్రస్తుతం అన్ని స్టేషన్లకు విస్తరించారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే యూ.టి.ఎ్‌స.(జనరల్ బుకింగ్), పీ.ఆర్.ఎ్‌స(రిజర్వేషన్) కౌంటర్ల వద్ద ఈ సౌకర్యాన్ని కలిగించారు. అన్నిస్టేషన్‌లలోని టిక్కెట్ కౌంటర్ల విండో వెలుపల ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. టిక్కెట్ జారీకి సమగ్ర వివరాలను సిస్టమ్‌లో నమోదు చేసిన తర్వాత, చెల్లింపును అంగీకరించే ముందుగా ఈ పరికరాలలో క్యూఆర్ కోడ్ కన్పిస్తుంది. మొబైల్ ఫోన్‌లోని చెల్లింపు యాప్ ద్వారా ప్రయాణికుడు దానిని స్కాన్ చేసి నిర్దేశించిన ఛార్జీ జమచేసిన పక్షంలో వెంటనే టికెట్ ఆయనకు అందుతుంది.