Share News

Ration Scam: ప్రకంపనలు రేపుతున్న రేషన్ కుంభకోణం.. టీఎంసీ మరో కీలక నేత అరెస్ట్

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:35 PM

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం రేషన్ కుంభకోణం(Ration Scam) ప్రకంపనలు రేపుతోంది. అధికార టీఎంసీ(TMC) నేతల్లో వణుకు పుట్టిస్తోంది. రేషన్ పంపిణీ కుంభకోణంలో నార్త్ 24 పరగణాస్ జిల్లా బంగావ్ మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్, తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడు శంకర్ ఆదిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇవాళ అరెస్టు చేసింది.

Ration Scam: ప్రకంపనలు రేపుతున్న రేషన్ కుంభకోణం.. టీఎంసీ మరో కీలక నేత అరెస్ట్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం రేషన్ కుంభకోణం(Ration Scam) ప్రకంపనలు రేపుతోంది. అధికార టీఎంసీ(TMC) నేతల్లో వణుకు పుట్టిస్తోంది. రేషన్ పంపిణీ కుంభకోణంలో నార్త్ 24 పరగణాస్ జిల్లా బంగావ్ మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్, తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడు శంకర్ ఆదిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇవాళ అరెస్టు చేసింది. శుక్రవారం ఓ టీఎంసీ నేత ఇంట్లో సోదాకు వెళ్లిన ED బృందంపై స్థానికుల దాడి అనంతరం తాజా అరెస్ట్ జరిగింది. అయితే విచారణలో సహకరించినప్పటికీ తన భర్తను అరెస్ట్ చేశారని శంకర్ భార్య జోత్స్న అధ్యా అన్నారు.

అయితే శంకర్ సమాధానం సంతృప్తికరంగా లేని కారణంగా ఆయన్ని అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు. అరెస్ట్ తర్వాత ఆయన మద్దతుదారులు ఆపడానికి ప్రయత్నించారని సీఆర్పీఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకుని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. టీఎంసీ నేతతో పాటు ఆయన అత్తమామలు, సహచరుల నివాసాలు, వారికి సంబంధించిన ఐస్ క్రీం ఫ్యాక్టరీలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో లభించిన కొన్ని పత్రాలతో పాటు రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది.

Updated Date - Jan 06 , 2024 | 01:35 PM