Share News

TMC MP: వివాదంలో చిక్కుకున్న సినీ నటి రచనా

ABN , Publish Date - Aug 18 , 2024 | 05:28 PM

ఇక ఈ వీడియోలో తాను స్పందించిన తీరుపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రచనా బెనర్జీ స్పందించారు. ఇది ఖచ్చితంగా నా వైపు నుంచి జరిగిన చాలా పెద్ద తప్పుగా ఆమె అభివర్ణించారు. తాను ఇలా చేసి ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. అందరూ చేస్తున్నట్లే తాను సైతం మరో పేరుతో ఆమెను పిలవాల్సి ఉందన్నారు. కానీ ఆ సమయంలో తాను చాలా వేదనను అనుభవించానని చెప్పారు.

TMC MP: వివాదంలో చిక్కుకున్న సినీ నటి రచనా

కోల్‌కతా, ఆగస్ట్ 18: ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై లైంగిక దాడి ఘటనపై స్పందించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, నటి రచనా బెనర్జీ వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనపై ఆమె వీడియో ద్వారా స్పందించారు. ఆ క్రమంలో సదరు వీడియో చివరిలో బాధితురాలి పేరును ఎంపీ రచనా బెనర్జీ ప్రకటించారు. అనంతరం ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియోలో బాధితురాలి పేరు అధికార టీఎంసీ ఎంపి ప్రకటించడంపై పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర దుమారం రేగింది.

Also Read: Mohanlal: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోహన్‌లాల్


రచనపై పోలీసులు కేసు నమోదు..

దీంతో కోల్‌కతా హైకోర్టు న్యాయవాది శయన్ సచిన్ బాసు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రచనా బెనర్జీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు.. ఈ వీడియోలో మృతురాలి పేరు ఆమె పలుమార్లు పేర్కొన్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే మృతురాలి పేరు ఇలా పలుమార్లు ఉచ్చరించడం వల్ల.. బాధితురాలి గాయాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే ఆమె కుటుంబ భద్రతతోపాటు వారి గౌరవాన్ని సైతం మరింత ప్రమాదంలోకి నెడుతుందంటూ సదరు న్యాయవాదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై ఎంపీ క్షమాపణలు చెప్పడంతోపాటు సోషల్ మీడియాలో నుంచి ఆ వీడియోను సైతం తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Bengaluru Student: పార్టీ నుంచి ఇంటికి వెళ్తున్న యువతిపై దారుణం..


స్పందించిన ఎంపీ, నటి రచన..

ఇక ఈ వీడియోలో తాను స్పందించిన తీరుపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రచనా బెనర్జీ స్పందించారు. ఇది ఖచ్చితంగా నా వైపు నుంచి జరిగిన చాలా పెద్ద తప్పుగా ఆమె అభివర్ణించారు. తాను ఇలా చేసి ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. అందరూ చేస్తున్నట్లే తాను సైతం మరో పేరుతో ఆమెను పిలవాల్సి ఉందన్నారు. కానీ ఆ సమయంలో తాను చాలా వేదనను అనుభవించానని చెప్పారు.

Also Read: J&K Assembly polls: కిషన్‌రెడ్డి అధ్యక్షతన నేడు కీలక భేటీ


ఇది ఎవరో రాసిచ్చిన స్క్రీప్ట్ మాత్రం కాదు..

ఆ క్రమంలో తాను తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు. అందులోభాగంగా ఈ వీడియోలో తాను చెప్పిన మాటలు తన హృదయాంతరళంలో నుంచి వచ్చినవేనన్నారు. అయితే ఇవి ఎవరో రాసిచ్చిన స్క్రీప్ట్ మాత్రం కాదని స్పష్టం చేశారు. సహజంగానే, భావోద్వేగంతో.. మృతురాలి పేరు తనకు గుర్తుకు వచ్చిందన్నారు. తన ఒక్కదానికే కాదు.. అందరికీ ఆమె పేరు మనస్సులో నాటుకు పోయిందన్నారు.


వైద్యులతోపాటు లాకెట్ చటర్జీకి సైతం పోలీసులు సమన్లు..

ఇంకోవైపు మృతురాలి పోస్ట్‌మార్టం నివేదికపై స్పందించిన ప్రముఖ వైద్యులు సుబర్ణో గోస్వామి, కునాల్ శంకర్‌లు ఈ రోజు కోల్‌కతా పోలీసుల ఎదుట హాజరయ్యారు. అలాగే ఇదే అంశంపై స్పందించిన బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీకి సైతం ఇప్పటికే పోలీసులు సమన్లు జారీ చేశారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 18 , 2024 | 05:29 PM