Share News

PM Modi: సందేశ్‌ఖాలీ నేరస్థుడిని దీదీ కాపాడుతున్నారు.. మమతా బెనర్జీపై ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:38 PM

సందేశ్‌ఖాలీకి(Sandeshkhali) చెందిన నేరస్థుడు, టీఎంసీ నేత షేక్ షాజహాన్‌ను కాపాడేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రయత్రిస్తోందని ప్రధాని మోదీ(PM Modi) సంచలన ఆరోపణలు చేశారు.

PM Modi: సందేశ్‌ఖాలీ నేరస్థుడిని దీదీ కాపాడుతున్నారు.. మమతా బెనర్జీపై ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు

కోల్‌కతా: సందేశ్‌ఖాలీకి(Sandeshkhali) చెందిన నేరస్థుడు, టీఎంసీ నేత షేక్ షాజహాన్‌ను కాపాడేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రయత్రిస్తోందని ప్రధాని మోదీ(PM Modi) సంచలన ఆరోపణలు చేశారు. ఆరంబాగ్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కబ్జాలు, లైంగిక వేధింపులు, దాడులు చేసే వ్యక్తులకు టీఎంసీ అండగా నిలుస్తోందన్నారు.

సందేశ్‌ఖాలీలో మహిళల బాధల కంటే సీఎంకు కొందరి ఓట్లు ముఖ్యమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారన్నారు. నేరస్థులకు వంతపాడే టీఎంసీలాంటి పార్టీ అవసరమా అని ప్రజలను ప్రశ్నించారు.


తృణమూల్ కాంగ్రెస్ 'మా, మాతీ, మనుష్' (తల్లి, భూమి, ప్రజలు) నినాదాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మాట్లాడారు. 'సందేశ్‌ఖాలీలో టీఎంసీ మహిళలకు ఏం చేసింది. సంఘ సంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్‌లాంటి వ్యక్తుల ఆత్మలు ఇలాంటి వారి పనులతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. షాజహాన్ దాదాపు రెండు నెలలుగా పరారీలో ఉన్నాడు. అతన్ని రక్షించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ప్రతి గాయానికి ఓటుతో సమాధానం ఇవ్వండి" అంటూ మోదీ ప్రజలను కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2024 | 05:12 PM