Kashi: శిథిలాల కింద ఎనిమిది మంది.. కానిస్టేబుల్ కూడా
ABN , Publish Date - Aug 06 , 2024 | 07:46 AM
ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో రెండు ఇళ్లు కూలిపోయారు. కాశీ విశ్వనాథ్ ఆలయం ఎల్లో జోన్‌లో ఇళ్లు కూలిపోవడం తీవ్ర కలకలం రేపింది. సిల్కో గాలి మీదుగా ఎంట్రెన్స్ 4ఏకి వెళ్లే దారిలో ఉన్న ఇళ్లు సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో నేలమట్టం అయ్యాయి. ఇళ్లు కూలిపోయామని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో ఆరోగ్యశాఖ, డాగ్ స్వ్కాడ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి.
కాశీ: ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో (Kashi) రెండు ఇళ్లు కూలిపోయారు. కాశీ విశ్వనాథ్ ఆలయం ఎల్లో జోన్‌లో ఇళ్లు కూలిపోవడం తీవ్ర కలకలం రేపింది. సిల్కో గాలి మీదుగా ఎంట్రెన్స్ 4ఏకి వెళ్లే దారిలో ఉన్న ఇళ్లు సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో నేలమట్టం అయ్యాయి. ఇళ్లు కూలిపోయామని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో ఆరోగ్యశాఖ, డాగ్ స్వ్కాడ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి.
చౌక్ పోలీస్ స్టేషన్ ఏరియాలో గల ఖొవా గలిలో ఉన్న రెండు గృహలు ఒక్కసారిగా కూలిపోయాయి. అర్ధరాత్రి సమయం కావడంతో ఇళ్లలో ఉన్నవారు గాఢ నిద్రలో ఉన్నారు. శిథిలాల కింద ఎనిమిది మంది చిక్కుకున్నారని ప్రాథమికంగా అధికారులు వివరించారు. వారిలో ఓ పోలీసు కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ముగ్గురిని శిథిలాల నుంచి బయటకు తీశారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో ఐదుగురు శిథిలాల కింద ఉన్నారు. వారిని వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారా అని పరిశీలిస్తున్నారు. ఇళ్లు కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు.
For Latest News and National News click here