Share News

Udhayanidhi Stalin: నేను కలైంజర్ మనవడిని.. సనాతన ధర్మం వివాదంపై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 22 , 2024 | 09:22 PM

సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పే ప్రశ్నే లేదని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పినప్పటికీ ఇటీవల డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన వైఖరిని ఆయన పునరుద్ఘాటించినట్టు అయింది. దిండిగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Udhayanidhi Stalin: నేను కలైంజర్ మనవడిని.. సనాతన ధర్మం వివాదంపై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
Udaya Nidhi Stalin

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ సెప్టెంబర్ 2023లో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి సమర్థించుకున్నారు. ఈ వ్యాఖ్యలపై తాను క్షమాపణలు చెప్పబోనని మంగళవారం ఆయన ప్రకటించారు. ‘‘కోర్టులో క్షమాపణ చెప్పమని నన్ను అడిగారు. కానీ నేను ఒక వ్యాఖ్య చేస్తే అది అంతే ఉంటుంది. నేను కోర్టులో కేసులు ఎదుర్కొంటున్నాను. నేను కలైంజర్ (దివంగత సీఎం కరుణానిధి) మనవడిని క్షమాపణలు చెప్పబోను’’ అని ఆయన అన్నారు.


సనాతన ధర్మంపై తాను వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పే ప్రశ్నే లేదని అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పినప్పటికీ ఇటీవల డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన వైఖరిని ఆయన పునరుద్ఘాటించినట్టు అయింది. దిండిగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఒకప్పుడు మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు, స్కూళ్లకు వెళ్లేందుకు హక్కులు ఉండేవి కావని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తాను పెరియార్‌, ద్రావిడ దిగ్గజం సీఎన్‌ అన్నాదురై, డీఎంకే దివంగత నేత ఎం కరుణానిధిని అనుసరించానని, ఆ నాయకులు గతంలో ఏం మాట్లాడారో మాత్రమే తాను చెప్పానని డిప్యూటీ సీఎం సమర్థించుకున్నారు. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక కోర్టులలో తనపై కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇక కోర్టుల్లో తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు వక్రీకరణల ఆధారంగా నమోదయ్యాయని, తాను చెప్పని మాటలను చెప్పినట్లుగానే పిటిషన్లు సమర్పించారని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇక తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దడానికి చాలా మంది అనేక మార్గాలలో ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. నవ వధూవరులు తమకు పుట్టబోయే పిల్లలకు ‘అందమైన తమిళ పేర్లను’ ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు.


ఇవి కూడా చదవండి

శబరిమల యాత్రకు ప్రత్యేక రైలు

సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

పసిడి ప్రియులకు భారీ షాక్.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ఏఐ వినియోగంలో జర జాగ్రత్త

For more National News and Business News and Telugu News

Updated Date - Oct 22 , 2024 | 09:27 PM