Share News

Temple: జమ్మూలో 30 ఏళ్ల తరువాత తెరుచుకున్న ఆలయం.. ముస్లింల హర్షం

ABN , Publish Date - Jul 15 , 2024 | 10:04 AM

జమ్మూకశ్మీర్‌లోని(Jammu Kashmir) రాష్ట్రం అనంత్‌నాగ్ జిల్లాలో 30 ఏళ్ల తర్వాత ఉమా భగవతీ దేవి ఆలయాన్ని ఆదివారం కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో తెరిచినట్లు అధికారులు తెలిపారు.

Temple: జమ్మూలో 30 ఏళ్ల తరువాత తెరుచుకున్న ఆలయం.. ముస్లింల హర్షం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని(Jammu Kashmir) రాష్ట్రం అనంత్‌నాగ్ జిల్లాలో 30 ఏళ్ల తర్వాత ఉమా భగవతీ దేవి ఆలయాన్ని ఆదివారం కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో తెరిచినట్లు అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనుల తరువాత, ఆలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.

తొలిరోజు అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన ఉమా దేవి విగ్రహాన్ని మంత్రోచ్ఛారణల నడుమ గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఆలయ పునరుద్ధరణపై స్థానికులు, కాశ్మీరీ పండిట్లు, ముస్లింలు సంతోషం వ్యక్తం చేశారు.


"గుడి అభివృద్ధికి పండిట్ సోదరులకు సాయం చేసేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉంటాం" అని స్థానికుడు గుల్జార్ అహ్మద్ అన్నారు. 34 ఏళ్ల తర్వాత ఆలయం ప్రారంభం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 1990లో కూల్చివేసిన ఉమా భగవతి అమ్మవారి ఆలయం పునరుద్ధరణ జరిగినట్లు కేంద్రమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు.

For Latest News and National News click here

Updated Date - Jul 15 , 2024 | 10:04 AM