Rajya Sabha Elections: మధ్యప్రదేశ్ నుంచి మొత్తం 5 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
ABN , Publish Date - Feb 20 , 2024 | 06:33 PM
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్న కేంద్ర మంత్రి ఎల్.మురుగున్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుంచి ఒక అభ్యర్థి పోటీకి దిగారు. రాష్ట్రం నుంచి మొత్తం ఐదు రాజ్యసభ స్థానాలకు ఐదుగురే పోటీ చేయడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) నుంచి రాజ్యసభ (Rajya Sabha) ఎన్నికల బరిలో ఉన్న కేంద్ర మంత్రి ఎల్.మురుగున్ (L.Murugan) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా, కాంగ్రెస్ (Congress) నుంచి ఒక అభ్యర్థి పోటీకి దిగారు. రాష్ట్రం నుంచి మొత్తం ఐదు రాజ్యసభ స్థానాలకు ఐదుగురే పోటీ చేయడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 27న 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మధ్యప్రదేశ్ విజేతలు వీరే..
-కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ (బీజేపీ)
-మధ్యప్రదేశ్ బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు మాయా నరోలియా (బీజేపీ)
-వాల్మీకి థామ్ ఆశ్రమం అధిపతి ఉమేష్ నాథ్ మహరాజ్ (బీజేపీ)
-కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు బన్సీలాల్ గుర్జర్ (బీజేపీ)
-మధ్యప్రదేశ్ కాంగ్రెస్ విభాగం కోశాధికారి అశోక్ సింగ్ (కాంగ్రెస్)