Share News

నాలుగోసారి గ్యారెంటీ లేదు కానీ.. అథవాలే మాత్రం మళ్లీ కేంద్రమంత్రి అవుతారు

ABN , Publish Date - Sep 24 , 2024 | 03:56 AM

కేంద్రంలో తాము వరుసగా నాలుగోసారి అధికారం చేపడతామన్న గ్యారెంటీ లేనప్పటికీ, తన క్యాబినెట్‌ సహచరుడు రాందాస్‌ అథవాలే మాత్రం మరోసారి మంత్రి అవ్వడం ఖాయమని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చమత్కరించారు.

నాలుగోసారి గ్యారెంటీ లేదు కానీ.. అథవాలే మాత్రం మళ్లీ కేంద్రమంత్రి అవుతారు

  • కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సరదా వ్యాఖ్యలు

నాగ్‌పూర్‌, సెప్టెంబరు 23: కేంద్రంలో తాము వరుసగా నాలుగోసారి అధికారం చేపడతామన్న గ్యారెంటీ లేనప్పటికీ, తన క్యాబినెట్‌ సహచరుడు రాందాస్‌ అథవాలే మాత్రం మరోసారి మంత్రి అవ్వడం ఖాయమని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చమత్కరించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, అది కేవలం జోక్‌ అని అనంతరం గడ్కరీ పేర్కొనడం గమనార్హం. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్‌పీఐ) నాయకుడైన అథవాలే కేంద్రంలోని మోదీ ప్రభుత్వాల్లో వరుసగా మూడుసార్లు మంత్రి పదవి చేపట్టారు. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గనుక నాలుగోసారీ కేంద్ర మంత్రిగా తన పరంపర కొనసాగుతుందని ఈ కార్యక్రమంలో అథవాలే విశ్వాసం వ్యక్తం చేయగా, గడ్కరీ పైవిధంగా స్పందించారు.

Updated Date - Sep 24 , 2024 | 03:56 AM