Share News

Uttar Pradesh: 9 రోజుల తర్వాత.. ఎట్టకేలకు దొరికిన మృతదేహం.. ఎవరిదంటే..?

ABN , Publish Date - Sep 09 , 2024 | 05:08 PM

ఎట్టకేలకు తొమ్మిది రోజుల అనంతరం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్థన్ సింగ్ మృతదేహాన్ని కనుగొన్నారు. కాన్పూరులోని గంగ నది బ్యారేజీ సమీపంలో ఆయన మృతదేహాన్ని ఆదివారం రాత్రి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కనుగొన్నారు.

Uttar Pradesh: 9 రోజుల తర్వాత.. ఎట్టకేలకు దొరికిన మృతదేహం.. ఎవరిదంటే..?

లఖ్‌నవూ, సెప్టెంబర్ 09: ఎట్టకేలకు తొమ్మిది రోజుల అనంతరం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్థన్ సింగ్ మృతదేహాన్ని కనుగొన్నారు. కాన్పూరులోని గంగ నది బ్యారేజీ సమీపంలో ఆయన మృతదేహాన్ని ఆదివారం రాత్రి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కనుగొన్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆదిత్య వర్ధన్ సింగ్ మృతదేహాన్ని ఆతని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన స్వగ్రామంలో కుటుంబ సభ్యులు సమక్షంలో సోమవారం ఆదిత్య వర్థన్ అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read: RG Kar Medical Student: వైద్యురాలి తండ్రి ఆరోపణలు ఖండించిన సీఎం మమత.. ఇదంతా కుట్ర


ఆగస్ట్ 31వ తేదీన ఉన్నవ్ జిల్లాలోని నానామౌ ఘాట్‌లో తన స్నేహితులతో కలిసి ఆదిత్య వర్ధన్ సింగ్ గంగానదిలో స్నానానికి దిగారు. ఆ క్రమంలో సెల్ఫీ తీసుకునేందుకు ప్రత్నించారు. అప్పుడే నదిలో వరద నీటి ప్రవాహ ఉదృతి పెరిగింది. ఆ ప్రవహంలో ఆయన మునిగి పోయారు. ఇంతలో ఆయన స్నేహితులు వెంటనే స్పందించారు.

Also Read: Ganesh Chaturthi: తొలి రోజే ఈ ‘గణపతి’రికార్డు


ఆయన్ని రక్షించాలంటూ అక్కడే ఉన్న గజ ఈతగాళ్ల వాళ్లు కోరారు. తమకు వెంటనే రూ.10 వేలు చెల్లిస్తే ఆదిత్య వర్థన్‌ను రక్షిస్తామని వారు స్పష్టం చేశారు. వారు నీటిలో ఉండి పోవడం.. వారి వద్ద అంత నగదు లేక పోవడంతో.. ఆన్‌లైన్‌లో నగదు చెల్లించేందుకు వారు ప్రయత్నించారు. నెట్ కాస్తా స్లోగా ఉండడంతో నగదు లావాదేవి కాస్తా ఆలస్యమైంది. ఈ తతంగం జరిగే లోపే ఆదిత్య వర్ధన్ నీట మునిగిపోయాడు.


ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే రంగంలోకి దిగి.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆదిత్య వర్థన్ మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. దీంతో ప్రభుత్వంలోని పెద్దలు రంగంలోకి దిగారు. దాంతో 200 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఆదిత్య వర్థన్ కోసం గాలింపు కోసం వినియోగించారు.


దాదాపు తొమ్మిది రోజుల అనంతరం ఆదిత్య వర్థన మృతదేహాన్ని కనుగొన్నారు. ఆదిత్య వర్దన్ భార్య మహారాష్ట్రలో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయన కుటుంబంలోని వారంతా ఉత్తరప్రదేశ్, బిహార్‌లో కీలక శాఖల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు.

Read More National News and Latest Telugu News Click Here

Updated Date - Sep 09 , 2024 | 05:08 PM