Share News

Uttar Pradesh: మోదీ, యోగిలపై అనుచిత వ్యాఖ్యలు: పంతులమ్మపై సస్పెన్షన్ వేటు

ABN , Publish Date - May 27 , 2024 | 08:12 PM

ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వర్ష సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసింది.

Uttar Pradesh: మోదీ, యోగిలపై అనుచిత వ్యాఖ్యలు: పంతులమ్మపై సస్పెన్షన్ వేటు

లఖ్‌నవూ, మే 27: ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వర్ష సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెపై విద్యాశాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ కౌశంబి జిల్లా చోటు చేసుకుంది.

Bangalore Rave Party: హేమ ఏంటి ఈ డ్రామా..!

ఈ పోస్ట్ నేపథ్యంలో కోఖ్రజ్ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు సైతం నమోదు అయింది. అయితే టీచర్ వర్ష అభ్యంతరకర వ్యాఖ్యలపై విద్యా శాఖ సీరియస్ అయింది. ఆ క్రమంలో విద్యాశాఖ అధికారి కమలమేంద్ర కుష్వానా.. ఆమెను సస్పెన్షన్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Pen Drive Videos: పోలీసులకు డేట్.. టైమ్.. చెప్పిన ప్రజ్వల్


Bangladesh MP: ఇటువంటి హత్య జీవితంలో చూడలేదు

కౌశంబి జిల్లాలోని సిరత్ తాలుకలో ఓ గ్రామంలో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో వర్ష ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తుంది. ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు ఆదివారం సమాచారం అందడంతో... వారు సైతం టీచర్ వర్షపై కేసు నమోదు చేశారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 27 , 2024 | 08:13 PM