Rajya Sabha: బీహార్ నుంచి రాజ్యసభకు ఉపేంద్ర
ABN , Publish Date - Jul 02 , 2024 | 03:11 PM
రాష్ట్రీయ లోక్ మోర్చా నేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహ ను బీహార్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే నామినేట్ చేసింది. తనను బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నిక చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఎల్‌జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరికి ఉపేంద్ర కుష్వాహ కృతజ్ఞతలు తెలిపారు.
న్యూఢిల్లీ: రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) నేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహ (Upendra Kushwaha)ను బీహార్ (Bihar) నుంచి రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థిగా ఎన్డీయే (NDA) నామినేట్ చేసింది. తనను బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నిక చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఎల్‌జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరికి ఉపేంద్ర కుష్వాహ కృతజ్ఞతలు తెలిపారు.
Lok Sabha Updates: రాహుల్ ప్రసంగంపై వివాదం.. ఆ వ్యాఖ్యలు తొలగింపు..
ఎన్డీయే ఏకాభిప్రాయంతో ఉపేంద్ర కుష్వాహను రాజ్యసభకు నామినేట్ చేసినట్టు బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. ఇటీవల లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కరకట్ నియోజకవర్గం నుంచి ఉపేంద్ర కుష్వాహ పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. సీపీఐ(ఎంఎల్) అభ్యర్థి రాజా రామ్ సింగ్ ఇక్కడ గెలుపొందింది. కాగా, ఉపేంద్ర కుష్వాహను రాజ్యసభకు ఎంపిక చేసే విషయంలో ఎన్డీయే పలు ఈక్వేషన్లను పరిగణనలోకి తీసుకుందని చెబుతున్నారు. భవిష్యత్ ఎన్నికల్లో కుష్వాహ కమ్యూనిటీ మద్దతు సాధించడం, ఎన్డీయే విజయాలను మెరుగుపరచుకోవడం ఎన్డీయే వ్యూహంగా తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..