Share News

UPSC aspirants deaths: ఇప్పటికీ 12 మంది విద్యార్థుల ఆచూకీ తెలియడం లేదు...ఎంపీ సంచలన వ్యాఖ్య

ABN , Publish Date - Jul 30 , 2024 | 04:27 PM

ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని ఐఏఎస్ కోటింగ్ సెంటర్‌లోని సెల్లార్‌ను వరద నీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థుల మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో లోక్‌సభ ఎంపీ పప్పు యాదవ్ మంగళవారంనాడు కీలక వ్యాఖ్య చేశారు. కోచింగ్ సెంటర్‌లోని 10 నుంచి 12 మంది విద్యార్థుల జాడ ఇప్పటికీ తెలియకుండా ఉందని అన్నారు.

UPSC aspirants deaths: ఇప్పటికీ 12 మంది విద్యార్థుల ఆచూకీ తెలియడం లేదు...ఎంపీ సంచలన వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని ఐఏఎస్ కోటింగ్ సెంటర్‌లోని సెల్లార్‌ను వరద నీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థుల మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో లోక్‌సభ ఎంపీ పప్పు యాదవ్ (Pappu Yadav) మంగళవారంనాడు కీలక వ్యాఖ్య చేశారు. కోచింగ్ సెంటర్‌లోని 10 నుంచి 12 మంది విద్యార్థుల జాడ ఇప్పటికీ తెలియకుండా ఉందని అన్నారు.


''కోచింగ్ సెంటర్‌లో మృతి చెందిన విద్యార్థులు ముగ్గురు మాత్రమే కాదు. ఆరుగురు మిస్సింగ్ విద్యార్థుల లిస్ట్ కూడా ఉంది. అయితే కనీసం 10 నుంచి 12 మంది ఆచూకీ గల్లంతయినట్టు నేను అనుకుంటున్నాను. వాస్తవాలను దాచిపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి'' అని యాదవ్ పేర్కొన్నారు.

Wayanad landslides: వయనాడ్‌ను ఆదుకోండి... కేంద్రాన్ని కోరిన రాహుల్ గాంధీ


దేశంలో కోచింగ్ సంస్థల విషయంలో ఎలాంటి దూరదృష్టి లేదని, ఎలాంటి గైడ్‌లైన్స్ లేవని పప్పు యాదవ్ అన్నారు. కోచింగ్ సంస్థలను నియంత్రించేందుకు ప్రభుత్వం చట్టం తేవాలని సూచించారు. విద్యార్థులకు ఎక్కడా భద్రత లేదని, వంచనకు గురవుతున్నారని ఆయన తెలిపారు. కోటలో 900 మంది విద్యార్థులు ఆత్యహత్య చేసుకున్నారని, బీహార్ నుంచే అత్యధికంగా 60 శాతం విద్యార్థులు చదవుల కోసం బెంగళూరు, కోట, ఢిల్లీ వెళ్తున్నారని, యూపీఎస్‌సీ పరీక్షలకు హాజరయ్యే వారిలో ఎక్కువ మంది బీహార్ విద్యార్థులే ఉంటున్నారని చెప్పారు. బీహార్ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో తమ పిల్లల చదువులకు రూ.40,000 కోట్లు ఖర్చుచేస్తున్నారని, ప్రభుత్వం మాత్రం వారి భద్రతపై ఎలాంటి దృష్టి పెట్టడం లేదని విమర్శించారు.


కాగా, మరోవైపు యూపీఎస్‌సీ ఆశావహుల మరణంపై ఢిల్లీ ఓల్డ్ రాజేంద్రనగర్‌లో విద్యార్థులు నిరసనలు కొనసాగుతున్నారు. గత ఆదివారం భారీ వర్షాలతో కోచింగ్ సెంటర్‌లోని సెల్లార్‌లోకి వరద నీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, ఇతమిత్ధంగా మృతుల సంఖ్య వెల్లడించాలని నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 30 , 2024 | 04:29 PM