Share News

అమెరికా ఈబీ-1 వీసా నిబంధనల్లో మార్పులు

ABN , Publish Date - Oct 19 , 2024 | 03:13 AM

గత వారం యూఎస్‌ సిటిజన్‌షిప్‌, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎ్‌ససీఐఎస్‌) ఈబీ-1 వీసా కేటగిరి నిబంధనల్లో మార్పులు చేసింది.

అమెరికా ఈబీ-1 వీసా నిబంధనల్లో మార్పులు

న్యూఢిల్లీ, అక్టోబరు 18: గత వారం యూఎస్‌ సిటిజన్‌షిప్‌, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎ్‌ససీఐఎస్‌) ఈబీ-1 వీసా కేటగిరి నిబంధనల్లో మార్పులు చేసింది. అవి తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. సైన్స్‌, ఆర్ట్స్‌, విద్య, వ్యాపారం, ఆటల్లో ‘అసాధారణ సామర్థ్యాన్ని’ నిరూపించుకోవాలన్న దరఖాస్తుదారుని బాధ్యతను సరళతరం చేసింది. వీసా అర్హతగా నమోదయిన టీమ్‌ విజయాలను సాక్ష్యంగా చూపించినా సరిపోతుందంటూ వివరణ ఇచ్చింది. దీనివల్ల భారతీయులు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది.

వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన వారు ఈబీ-1(ఎక్స్‌ట్రార్డినరీ ఎబిలిటీ పర్మినెంట్‌ రెసిడెన్స్‌ వీసా) వీసాకు అర్హులు. వీరు శాశ్వతంగా అమెరికాలో నివసించవచ్చు, పనిచేయవచ్చు. ఈ వీసాను పొందిన వారి జీవిత భాగస్వామి, పిల్లలు కూడా గ్రీన్‌కార్డు దరఖాస్తుకు అర్హులు అవుతారు. నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ లెక్కల ప్రకారం 2023 నవంబరు నాటికి 1.4 లక్షల మది ఈబీ-1 గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త రూల్స్‌ ప్రకారం అసాధారణ సామర్థ్యాలను నిరూపించుకోవడానికి తగిన ఆధారాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా స్వయంగా ఈబీ-1ఏ వీసా గ్రీన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated Date - Oct 19 , 2024 | 03:13 AM