Crime News: ట్రంప్‌ను టార్గెట్ చేసి.. కుటుంబం మొత్తాన్ని బలి తీసుకున్నాడు
ABN , Publish Date - Nov 11 , 2024 | 12:52 PM
సోషల్ మీడియాలో ట్రంప్ పై విద్వేశపూరిత పోస్టులు పెడుతున్న ఓ నెటిజన్ చివరకు కుటుంబాన్నే కాలరాశాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలో ఈ వార్త సంచలనంగా మారింది.
వాషింగ్టన్: ఓ వ్యక్తి ఉన్మాదం భార్యతో పాటు అతడి నుంచి దూరంగా ఉంటున్న మాజీ ప్రేయసిని, ఇద్దరు కుమారులను బలి తీసుకుంది. తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకునేలా చేసింది. అతడిని అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన ఆంటోనీ నెఫ్యూగా పోలీసులు గుర్తించారు. గురువారం ఆంటోనీ మాజీ భార్యతో పాటు ఇద్దరు కుమారులు హత్యకు గురయ్యారు. ఆ ఇంటికి సమీపంలోనే ఆంటోనీ భార్య, అతడి ఏడేళ్ల కుమారుడు సైతం రక్తపు మడుగులో కనిపించారు.
ట్రంప్ ను టార్గెట్ చేస్తూ..
ఈ హత్యలకు కారణం ఆంటోనీయే అనే అనుమానంతో పోలీసులు గాలింపు చేపట్టారు. అతడి ఇంటికొచ్చిన పోలీసులు మరోసారి షాక్‌కు గురయ్యారు. ఆంటోనీ సైతం తనని తాను తుపాకీతో కాల్చుకుని విగతజీవిగా పడిఉన్నాడు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అతడి ఫేస్ బుక్ ఖాతాను పరిశీలించగా హత్యలకు ముందు అమెరికా నూతనాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విద్వేశ పూరిత పోస్టులు చేస్తున్నట్టుగా గుర్తించారు. దీన్ని బట్టి ఆంటోనీ మానసిక స్థితి సరిగా లేదని.. అదే ఈ హత్యలకు కారణమయ్యుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, ఈ హత్యల వెనుక హతుడి అసలు ఉద్దేశం ఏమయ్యుంటుందనే విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు.
ట్రంప్ ఫొటో కింద ద్వేషం అని రాసి ఉన్న పోస్టును పోలీసులు స్వేకరించారు. అలాగే అతని పాలనలో మహిళలకు రక్షణ లేదని అతడు ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలిపారు. కొంత కాలంగా కాల్చుకుని చనిపోవాలని, సిలువ వేయబడాలనే ఆలోచనలు వస్తున్నట్టుగా ఆంటోనీ పోస్టుల్లో పేర్కొన్నట్టు గుర్తించారు.