Share News

Chardham Yatra: ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. చార్‌థామ్ యాత్ర నిలిపివేత

ABN , Publish Date - Jul 07 , 2024 | 04:07 PM

ఉత్తరాఖండ్‌ ను భారీ వర్షాలు ముంచెత్తుతుండటం, ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గర్వాల్ ప్రాంతంలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో చార్‌థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గార్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు.

Chardham Yatra:  ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. చార్‌థామ్ యాత్ర నిలిపివేత

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ (Uttarakhand) ను భారీ వర్షాలు ముంచెత్తుతుండటం, ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ (Red Alert) ప్రకటించింది. గర్వాల్ ప్రాంతంలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో చార్‌థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గార్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. వాతావరణ పరిస్థితి చక్కబడే వరకూ యాత్రికులు వేచిచూడాలని, ఎక్కడున్న వారు అక్కడే ఉండాలని సూచించారు.

Uttarakhand :కొండచరియలు విరిగిపడి.. ఇద్దరు హైదరాబాదీల మృతి


కాగా, గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నారు. దీంతో బద్రీనాథ్ వెళ్లే హైవేపై రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. శనివారంనాడు కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ నుంచి బైక్‌పై తిరిగి వస్తున్న హైదరాబాద్‌కు చెదిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కర్ణప్రయాగ, గౌచర్ మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదేరోజు ఉత్తరాఖండ్‌లని రామనగర్ వద్ద వర్షాల ఉధృతికి ఒక వంతెన కుప్పకూలింది. జోషిమఠ్ సమీపంలోని విష్ణు ప్రయాగ్ వద్ద నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహస్తున్నట్టు అధికారులు ప్రకటంచారు. ఐఎండీ రెడ్ అలర్ట్ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

For Latest News and National News click here

Updated Date - Jul 07 , 2024 | 04:08 PM