Share News

Jharkhand: హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ను సమర్థించిన సుప్రీం ధర్మాసనం

ABN , Publish Date - Jul 29 , 2024 | 01:21 PM

జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఈడీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. ఈ సందర్బంగా హేమంత్ సోరెన్‌కు జార్ఖ్ండ్ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులోని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం సమర్థించింది.

Jharkhand: హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ను సమర్థించిన సుప్రీం ధర్మాసనం

న్యూఢిల్లీ, జులై 29: జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఈడీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. ఈ సందర్బంగా హేమంత్ సోరెన్‌కు జార్ఖ్ండ్ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులోని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం సమర్థించింది.

Also Read: Rajasthan: సీఎంను హత్య చేస్తామంటూ బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు


భూ కుంభకోణంలో మని లాండరింగ్ వ్యవహారంలో ఆరోపణలు నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈ ఏడాది జనవరిలో ఈడీ అరెస్ట్ చేసింది. నాటి నుంచి బిర్సా ముండా జైల్లో ఉన్నారు. ఆ క్రమంలో ఆయన బెయిల్ కోసం పలుమార్లు కోర్టులను సైతం ఆశ్రయించారు. కానీ బెయిల్ మాత్రం హేమంత్ సోరెన్‌కు లభించ లేదు. అయితే ఇటీవల ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం రాజధాని రాంచిలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు.

Ravi Moun: రష్యా- ఉక్రెయిన్ యుద్దంలో హరియాణ వాసి మృతి


ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ ఓటమి లక్ష్యంగా పని చేయాలని వారికి పిలుపు నిచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవికి చంపయ్ సోరెన్ రాజీనామా చేశారు. దాంతో హేమంత్ సోరెన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఆయన కేబినెట్‌లో చంపయి సోరెన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే.

Also Read: UPSC aspirants’ death: లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్ సిద్ధం


మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని అందుకునే లక్ష్యంతో సీఎం హేమంత్ సోరెన్ పని చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం 14 ఎంపీ స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 5 స్థానాలు ఇండియా కూటమి గెలుచుకోగా.. 9 స్థానాలను ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంది.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 29 , 2024 | 01:25 PM