Share News

BJP: బీజేపీ జాతీయాధ్యక్షుడి మార్పు! ఆ స్థానంలో ఎవరంటే?

ABN , Publish Date - Jun 06 , 2024 | 02:18 PM

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతో పార్టీని పటిష్టపరిచేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ను తప్పించి ఆ స్థానంలో మరో సీనియర్ నేతకు అవకాశం ఇవ్వాలని అనుకుంటోంది.

BJP: బీజేపీ జాతీయాధ్యక్షుడి మార్పు! ఆ స్థానంలో ఎవరంటే?

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతో పార్టీని పటిష్టపరిచేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ను తప్పించి ఆ స్థానంలో మరో సీనియర్ నేతకు అవకాశం ఇవ్వాలని అనుకుంటోంది.

ఆయన మరెవరో కాదు.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్‌(Shivraj Singh Chouhan). ఆయన్నే పార్టీ అధ్యక్ష పదవి వరించనన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఘన విజయం సాధించి రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

shivraj.jpg


బీజేపీ అధిష్టానం కొన్ని నెలల క్రితం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించింది. నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ నియమితులయ్యారు. అయితే చౌహాన్ బీజేపీ సీఎంగా16 ఏళ్లకుపైగా పనిచేశారు. ఆయన్ని సీఎం పదవి నుంచి తొలగించినప్పటి నుంచి కొంత అసంతృప్తితో ఉన్నారు.

తాజాగా ఆయన్ని అధిష్టానం ఢిల్లీకి పిలిపించడంతో అధ్యక్ష పదవి ఆయన్ని వరించబోతోందనే చర్చ నడుస్తోంది. ఆయనతో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని సైతం అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.


ఎంపీగా చౌహన్ గెలుపు..

లోక్ సభ ఎన్నికల్లో విదిషా నుంచి పోటీ చేసిన చౌహాన్ సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 8,21,408 మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు11,16,460 ఓట్లు రాగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ భాను శర్మ 2,95,052 ఓట్లతో సరిపెట్టుకున్నారు.

Read Latest National News and Telugu News click here

Updated Date - Jun 06 , 2024 | 02:39 PM